spot_img
Homeఎంటర్టైన్మెంట్Raja Saab: రాజా సాబ్ గురించి షాకింగ్ సీక్రెట్ లీక్ చేసిన ప్రభాస్ ఫ్రెండ్!

Raja Saab: రాజా సాబ్ గురించి షాకింగ్ సీక్రెట్ లీక్ చేసిన ప్రభాస్ ఫ్రెండ్!

Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ రాజా సాబ్ ‘. హారర్ కామెడీ జోనర్ లో ఇది తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి నుంచి సైలెంట్ గా షూటింగ్ జరుపుతున్న మారుతి పోయిన సంక్రాంతికి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మూవీ టైటిల్ తో పాటు ప్రభాస్ వింటేజ్ లుక్ ని విడుదల చేశారు.

గతంలో ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరో… మారుతి కి ఛాన్స్ ఇవ్వడం ఏంటి? డార్లింగ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అసహనం వ్యక్తం చేస్తూ మారుతి పై విమర్శలు కూడా చేశారు. కానీ రాజా సాబ్ నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్ చేయడంతో వాళ్ళ అభిప్రాయం మారింది . సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నట్లు మారుతి చెప్పుకొచ్చారు.

ప్రభాస్ ఇమేజ్ కి తగట్టు సినిమా ఉంటుంది అని వెల్లడించారు. తాజాగా ప్రభాస్ అసిస్టెంట్ కమ్ ఫ్రెండ్ శ్రీను ‘ రాజా సాబ్ ‘ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ రాజా సాబ్ పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్టు అని అన్నారు. ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ సినిమాల వలె ఉండదు. ఎప్పుడు చూడని యాంగిల్స్ మీరు ఈ సినిమాలో చూస్తారంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది డిసెంబర్ లో రాజా సాబ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ కల్కి షూటింగ్ లో బిజీగా ఉండటంతో బ్రేక్ పడింది. దీంతో ప్రభాస్ లేని షాట్స్ ఇతర ఆర్టిస్టులతో మారుతి చేస్తున్నారట. కల్కి షూటింగ్ అయిన వెంటనే రాజా సాబ్ బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేయనున్నారు ప్రభాస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version