spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ ఉంటారు. అటువంటి వారిలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. రాజకీయాలను రాజకీయాలుగా చేయాలి తప్ప.. మన హుందా తప్పకూడదు అని ఇటీవల తేల్చి చెప్పారు. మా పార్టీలో అంబటి రాంబాబులా మాట్లాడ లేనని ఆయన సెటైర్లు వేశారు. తద్వారా అటువంటి నేతలు చేస్తున్న మాటలు పార్టీకి డామేజ్ చేస్తున్నాయని పరోక్ష సంకేతాలు పంపించారు. అయితే ఆయన భావిస్తున్నట్టు అది అంబటి గురించి కాదు. జగన్ పేరులో మారాలి అన్నట్టు పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. అధికారంలో లేకపోతే మాకేంటి లే అనుకుంటే సరిపోదు.. ప్రజల్లోనూ, సోషల్ మీడియాలోనూ మన గలాన్ని బలంగా వినిపించాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్ అని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

* నోరు తెరవని అధినేత..
జగన్మోహన్ రెడ్డి కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పై మాత్రమే విమర్శలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు భాగస్వామ్యమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని అసలు ప్రశ్నించడం లేదు. నీట్ లీకేజీ వ్యవహారంలో వైసీపీ తరఫున గట్టి గళం వినిపించాల్సిన వైసిపి అగ్రనాయకత్వం కామ్ గా ఉండిపోవడం పై కీర్తి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో తమ పార్టీ సైతం కాక్రోచ్ అంటూ వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి. తీరా దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుంటే.. ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్ సైలెంట్ గా ఉండిపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదే విషయంపై పరోక్షంగా జగన్ పై కేతిరెడ్డి సెటైర్ వేసినట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు వెంకట్రామిరెడ్డి కామెంట్స్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.

* గళం ఎత్తితేనే..
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం అనేది జాతీయస్థాయిలో అట్టుడికి పోతోంది. మన రాష్ట్రం నుంచి టిడిపి, జనసేనలు కనీస స్థాయిలో మాట్లాడలేవు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండడంతో వ్యతిరేకంగా మాట్లాడలేవు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి బలంగా గళం ఎత్తితే ఆయన ఓటు బ్యాంకు, ఆయన వెనుకున్న క్యాడర్ అంత రోడ్డు పైకి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మౌనముద్ర దాల్చారు. కేంద్రం అంటే భయం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. అయితే దీనిని నేరుగా చెప్పలేక.. ఇలా కీర్తి రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతుంది. సొంత పార్టీ నేతల అసహనం ఇప్పుడు వైసీపీలో కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒకలా, కేంద్రం విషయంలో మరోలా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి అని అర్థం అవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper