Homeఆంధ్రప్రదేశ్‌Kakani Govardhan Reddy vs Anil Kumar Yadav: అనిల్ కుమార్ వ‌ర్సెస్ గోవ‌ర్ధ‌న్‌రెడ్డి.. చెప్పేవేమో...

Kakani Govardhan Reddy vs Anil Kumar Yadav: అనిల్ కుమార్ వ‌ర్సెస్ గోవ‌ర్ధ‌న్‌రెడ్డి.. చెప్పేవేమో గొప్ప‌లు.. ప‌ద‌వి కోస‌మే తిప్ప‌లు..!

Kakani Govardhan Reddy vs Anil Kumar Yadav: రాజకీయ పార్టీలు అన్న తర్వాత వర్గ విభేదాలు చాలా కామన్. ఇక అధికార పార్టీ అయితే ఆ విభేదాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. మొన్నటి వరకు లోగుట్టుగా కొనసాగిన వైసీపీలోని వర్గ విభేదాలు.. కొత్త కేబినెట్ కారణంగా ఒక్కసారిగా బయట పడుతున్నాయి. 11 మందిని ఉంచి.. తమను తీసివేయడంతో మాజీ మంత్రులంతా గరం మీద ఉన్నారు. పైగా తమ స్థానంలో తమ జిల్లాకే చెందిన ప్రత్యర్థి వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం మరింత కాక రేపుతోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ తరహా విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.

Kakani Govardhan Reddy vs Anil Kumar Yadav:
Kakani Govardhan Reddy vs Anil Kumar Yadav:

ఇక్కడ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు.. ప్రస్తుతం కొత్త కేబినెట్ లో మంత్రి అయిన.. కాకాని గోవర్ధన్ రెడ్డికి వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. తనను మంత్రి పదవి నుండి తీసేసి గోవర్ధన్ రెడ్డికి ఇవ్వడంతో అనిల్ కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు బలప్రదర్శన సభలను పెట్టుకున్నారు. ఒకరిని మించి ఒకరు పెద్ద ఎత్తున జనాలను రప్పించి తమ బలమెంతో చూపించాలని అనుకుంటున్నారు. కాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇది బలప్రదర్శన కోసం చేస్తోంది కాదని.. ఇంటింటికీ వైఎస్సార్ కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నమంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Acharya Pre Release Event: జ‌గ‌న్‌ను చిరు అందుకే పిలిచారా.. జ‌న‌సైనికుల్లారా ఇది మీ కోస‌మే..!

ఇక మంత్రి అయిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వస్తున్న గోవర్ధన్ రెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటన పెట్టుకున్నారు. ఆయనకు స్వాగత సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఓ విషయం ఏంటంటే వీరిద్దరి సభలు ఇదే రోజు సాయంత్రం ఒకే సమయంలో ఉన్నాయి. అంటే పైకి వేరే కారణాలు చెబుతున్న కూడా వీరిద్దరూ తమ బ‌ల‌మేంటో జిల్లాలో చూపించాలని అనుకుంటున్నారు.

Kakani Govardhan Reddy vs Anil Kumar Yadav:
Kakani Govardhan Reddy vs Anil Kumar Yadav:

ఇదే విషయం పార్టీ హైకమాండ్ కు తెలియడంతో సీరియస్ అయింది. పార్టీలో ఇలాంటి వర్గ విభేదాలు మరోసారి జరగకూడదని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిందట. అంటే ఇన్నిరోజులు జగన్ మా దైవం అని.. ఆయన చెప్పిందే వింటామని లీడర్లు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ ఉత్తవే అన్నమాట. తమకు కావాల్సింది పదవి మాత్రమే అని ఈ విధంగా మరోసారి వైసీపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. మరి అంతే కదా.

ఎంత భజన చేసినా కూడా జగన్ పదవి ఇవ్వకపోతే మాత్రం ఊరుకుంటారా.. జగన్ మాటే శాసనం అని చెబుతున్న మాటలన్నీ కేవలం డైలాగ్స్ అని కేబినెట్ విస్తరణ తో ఈ విధంగా బయటపడుతున్నాయి. మరి రానురాను ఇంకెన్ని విభేదాలు బయట పడతాయో చూడాలి.

Also Read:Congress- TRS: శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడా..? కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌ కలిపిసోతుందా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version