Kadapa : కడపలో( Kadapa ) టిడిపి పండుగ మహానాడుకు సిద్ధపడుతోంది తెలుగుదేశం పార్టీ. తద్వారా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో 10 స్థానాలకు గాను ఏడు చోట్ల విజయం సాధించింది కూటమి. ఇదే పట్టు కొనసాగాలంటే కడప జిల్లాలో గట్టి సమన్వయంతో ముందుకు సాగాలని భావిస్తోంది. మరోవైపు టిడిపి ఆవిర్భావం తర్వాత ఇంతటి ఘనవిజయం కడప జిల్లాలో సొంతం చేసుకుంది ఆ పార్టీ. అందుకే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని మహానాడు ను కడప జిల్లాలో నిర్వహించాలని డిసైడ్ అయింది. అయితే అంతవరకు ఓకే కానీ.. ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి మాత్రం ఏమంత బాగాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐక్యతగా కనిపించిన ఆ పార్టీ నేతలు.. అధికారంలోకి వచ్చాక విభేదించుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
Also Read : మంత్రితో ఆ వైసీపీ మాజీ మంత్రి రహస్య భేటీ.. నిజం ఎంత?
కడపలో మహానాడు( mahanadu) నిర్వహించాలని భావించారు చంద్రబాబు. మే 27,28, 29 తేదీల్లో మహానాడు జరగనుంది. అయితే మహానాడు వేదిక ఖరారు చేసేందుకు కూడా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. వైయస్సార్ కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి రాజంపేటలో ఒక స్థలాన్ని చూపించారు. మరికొందరు నేతలు ఎర్రగుంట్ల మార్గంలో విమానాశ్రయం ఎదురుగా స్థలం అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆ స్థలాన్ని పరిశీలించారు మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, రాంప్రసాద్ రెడ్డి. అయితే ఆ స్థలం విషయంలో ఒప్పుకోవడం లేదు శ్రీనివాస్ రెడ్డి. కనీసం మంత్రులతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించలేదు కూడా. కమలాపురం టిడిపి నేతలు అక్కడ ఉండడంతోనే శ్రీనివాస్ రెడ్డి రాలేదని తెలుస్తోంది.
* పులివెందుల ( pulivendula) తెలుగుదేశం పార్టీలో విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అక్కడ నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నట్టు పరిస్థితి ఉంది. నిత్యం అక్కడ పార్టీలో విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. రెండు రోజుల కిందట టిడిపి సర్వసభ్య సమావేశం ఇన్చార్జి మంత్రి సవిత అధ్యక్షతన జరిగింది. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్గీయులపై బీటెక్ రవి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అయితే ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. చాలా సందర్భాల్లో ఇదే మాదిరిగా పరిస్థితి ఉంది.
* ప్రొద్దుటూరు ( Proddatur ) టిడిపిలో సైతం విభేదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, యువనేత ప్రవీణ్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ప్రవీణ్ సీఎం చంద్రబాబును కలిశారు. పార్టీలో కష్టపడిన వారికి మాత్రమే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులో ప్రవీణ్ రెడ్డి వివక్షను ఎదుర్కొంటున్నారు. ఆయన విషయంలో వరదరాజుల రెడ్డి తీవ్రంగా విభేదిస్తున్నారు.
* జమ్మలమడుగులో ( jammalamadugu ) బిజెపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు ఆదినారాయణ రెడ్డి. అక్కడ టిడిపి ఇన్చార్జిగా సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డి ఉన్నారు. ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా తన సీటును లాక్కోవడంపై భూపేష్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. నామినేటెడ్ పదవి దక్కకుండా చేస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది.
* కడప ( Kadapa ) అసెంబ్లీ స్థానంలో రెడ్డప్ప గారి మాధవి రెడ్డి దూకుడుగా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి సీనియర్లను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఆమెపై ఉంది. దీంతో అవకాశం వస్తే తిరుగుబాటు చేసేందుకు సీనియర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
* మైదుకూరు ( mydakuru ) నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన సీనియర్లలో ఉంది. అక్కడ కూడా అసంతృప్తి కనిపిస్తోంది. ఇది విభేదాలకు ఆజ్యం పోసే అవకాశం ఉంది.
* కమలాపురం ( kamalapuram) నియోజకవర్గంలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్యేతో కమలాపురం ఎమ్మెల్యే కు విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డికి ఓ సీనియర్ నే త లెక్క చేయడం లేదు. రియల్ ఎస్టేట్లో అతి జోక్యంతో వ్యాపారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కడప జిల్లాలో మహానాడు జరుగుతోంది అన్నమాట కానీ.. టిడిపిలో మాత్రం విభేదాలపర్వం నడుస్తోంది.
Also Read : వర్మ మాటలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించించేనా!?