KA Paul
KA Paul: కే ఏ పాల్ ( Ka Pal ) మరోసారి విశ్వరూపం ప్రదర్శించారు. ఈసారి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను( Nara Lokesh ) టార్గెట్ చేశారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనలో ఉన్న ఫైర్ ను బయటపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విపక్ష నేతలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ రెడ్ బుక్ సంస్కృతి పెరుగుతోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి విధితమే. లోకేష్ ఒక వ్యూహం ప్రకారం వైసీపీ నేతలను వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి లాంటి కీలక నేత రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనుక చంద్రబాబుతో పాటు లోకేష్ హస్తం ఉందని అనుమానాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నేతపై అటవీశాఖ భూముల ఆక్రమణ కేసు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
* చంద్రబాబుని కాపాడింది తానేనట
మరోవైపు సీఎం చంద్రబాబుపై( CM Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. చంద్రబాబును ఓడించిన ఘనత రాజశేఖర్ రెడ్డిది అని.. రాజశేఖర్ రెడ్డి అంటే చంద్రబాబు భయంతో ఉండేవారని గుర్తు చేశారు. అసలు రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రమాదం ఏర్పడకుండా చంద్రబాబును తానే కాపాడానని చెప్పుకొచ్చారు. తాను మధ్యవర్తిగా ఉండి రాజశేఖర్ రెడ్డిని ఒప్పించానని నాటి సంగతులను గుర్తు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్తారని నాడే చెప్పానని… నేను చెప్పిన మాదిరిగానే చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
* జగన్ జెంటిల్మెన్
వైయస్ జగన్మోహన్ రెడ్డిని( Y S Jagan Mohan Reddy ) ఆకాశానికి ఎత్తేసారు కేఏ పాల్. జగన్ ప్రభుత్వ హయాంలో తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అన్నారు. ఇప్పుడు రెడ్ బుక్ పేరు చెప్పి రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్నారని లోకేష్ పై మండిపడ్డారు. నువ్వెంత నీ బతుకెంత అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. మరోసారి విపక్ష నేతలపై కేసులు నమోదు చేసినా… అరెస్టులు జరిగినా ఊరుకునేది లేదు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రస్తుతం కే ఏ పాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* 22 సంవత్సరాల పాటు చంద్రబాబు కోసం ప్రార్థనలు
మరోవైపు తన ప్రార్థనల గురించి కూడా కేఏ పాల్( ka paul )ప్రస్తావించారు. లోకేష్ నీ పతనం గురించి కూడా ప్రార్థిస్తానని హెచ్చరించారు. 22 సంవత్సరాల తన బ్లెస్సింగ్స్ తోనే చంద్రబాబు రాజకీయాల్లో రాణించారని కూడా చెప్పుకొచ్చారు. మరోసారి రెడ్ బుక్ అంటూ ఎవరిపైనైనా కేసులు నమోదు చేస్తే తన విశ్వరూపం చూపిస్తానని హెచ్చరించారు. ఒరేయ్ లోకేష్.. తమాషాగా ఉందా.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు.. అంటూ కేఏ పాల్ ఫైర్ అయ్యారు. అయితే కేఏ పాల్ ఆగ్రహానికి విలేకరులు కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే వైసిపి సోషల్ మీడియా విపరీతంగా కేఏ పాల్ కామెంట్స్ ను వైరల్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత కే ఏ పాల్ మీడియా ముందుకు రావడం.. మంత్రి లోకేష్ ను టార్గెట్ చేసుకోవడం విశేషం.
ఒరేయ్ లోకేష్ గా వాళ్ళ ముందు నీ రెడ్ బుక్ ఎంత?
ఆ రోజు YSR తలుచుకునుంటే మీ నాన్న గతి ఎందో తెలుసుకో
– లోకేష్,బాబుని ఉతికారేసిన కేఏ పాల్ pic.twitter.com/BvMZbAvFYg
— Rahul (@2024YCP) February 4, 2025