Homeఆంధ్రప్రదేశ్‌Junior NTR : మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్.. తెర వెనుక జరిగింది అదే!

Junior NTR : మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్.. తెర వెనుక జరిగింది అదే!

Junior NTR : తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పండుగ మహానాడు సమయం ఆసన్నం అవుతోంది. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో మహానాడు జరగనుంది. ఈసారి మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తొలిసారిగా వైయస్ కుటుంబ అడ్డాలో మహానాడు పండుగ జరుపుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయం, చంద్రబాబుకు 75 వసంతాలు పూర్తి కావడం.. వంటివి ఈసారి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈసారి మహానాడు వేదికపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నందమూరి కుటుంబంలో ఐక్యత కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట హరికృష్ణ మనవడు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ వేడుకకు నందమూరి ఆడపడుచులంతా హాజరయ్యారు. అంతకుముందు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంతో కుటుంబమంతా ఒకచోట కలిసి వేడుక జరుపుకుంది.

Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్ లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి..? దాని ధర ఎంతో తెలుసా!

* ఏటా ఆనవాయితీ
ప్రతి సంవత్సరం ఎన్టీఆర్( Nandamuri Taraka Rama Rao ) జన్మదినం సందర్భంగా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2024 వరకు ఐదేళ్లపాటు చాలా రకాలుగా ఇబ్బందులు పడింది. మరోవైపు నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కుటుంబ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా ఉండేవారు. తెలుగుదేశం కార్యక్రమాల్లో సైతం పాలుపంచుకోలేదు. అయితే ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో వారు మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ కుటుంబంలో విభేదాలు లేవని పార్టీ శ్రేణులతో పాటు అభిమానులకు సంకేతాలు పంపేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

* ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం.. మహానాడుకు( mahanadu ) ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించి.. అభిమానుల్లోనూ, కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం నింపాలని హై కమాండ్ భావిస్తోంది. గత ఏడాదిగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులను పిలవాలని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను మహానాడులో చూడాలని టిడిపి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ తో హల్చల్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను ఊపుతూ అభిమానులకు ఆహ్లాదాన్ని పంచారు.

Also Read : పవన్ తీరుతో టిడిపిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన!

* తారక్ వైఖరిలో మార్పు..
ఇటీవల కుటుంబ విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ తో( Junior NTR ) పాటు కళ్యాణ్ రామ్ స్పందిస్తున్నారు. మొన్న ఆ మధ్యన నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు లభించింది. ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు. బాలా బాబాయ్ అంటూ ఆప్యాయంగా వ్యాఖ్యానించారు. ఇటీవల హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ తనయుడు సినీ రంగ ప్రవేశం చేశాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు అంతా ఒకచోటకు చేరారు. ఆడపడుచులు సైతం విచ్చేసి నూతన హీరోకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనుక కూడా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకనుంచి జరగబోయేది మరో ఎత్తు అన్నట్టు.. మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులంతా వస్తారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular