Job Opportunities: ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదువుకున్న యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఐటిఐ, డిప్లమో అర్హతతో జర్మనీలో నెలకు రూ.2.60 లక్షల జీతంతో కొలువులు సాధించే అవకాశం ఇస్తోంది. ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి… అనంతరం విదేశాలకు పంపించనుంది. 30 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. శిక్షణ అనంతరం ఉద్యోగం లో చేరితే ఖర్చులు తిరిగి చెల్లిస్తారు. ఇది నిజంగా నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశమే. సాధారణంగా ఐటిఐ చదివిన వారు వివిధ ట్రేడుల్లో శిక్షణ పొందుతారు. అటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులు 30 ఏళ్ల లోపు ఉండాలి. రెండు సంవత్సరాల ఐటిఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్, మూడు సంవత్సరాల డిప్లమో కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు.
* కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.260,000 నుంచి రెండు లక్షల 70 వేల వరకు జీతం ఉంటుంది. రెండేళ్ల ఒప్పందం ఉంటుంది. అదనంగా పనిచేస్తే అదనపు వేతనం ఇస్తారు. వసతితో పాటు ఇతర రాయితీలను సైతం ఉద్యోగం ఇచ్చిన సంస్థ చేస్తుంది.
* ఆసక్తి, అర్హత ఉన్నవారు apssdc.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పాస్పోర్ట్ గతంలో పనిచేసిన సమస్త నుంచి రిలీజింగ్ లెటర్, విద్యార్హతకు సంబంధించి డాక్యుమెంట్లు పొందుపరచాలి. మూడు వాయిదాలలో రూ. 1.15 లక్షల శిక్షణ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
* ఎంపికైన వారికి ఏ 1, ఏ 2 అని రెండు విభాగాలుగా ట్రైనింగ్ ఉంటుంది. వారికి జర్మన్ బాషా సైతం నేర్పిస్తారు.
* 12 నుంచి 14 వారాలపాటు రోజుకు ఎనిమిది గంటల పాటు శిక్షణ ఉంటుంది.
* నవంబర్ నుంచి ఈ శిక్షణ ప్రారంభం కానుంది.
* ముందుగా a1 లో జర్మన్ భాష నేర్పించి.. ఏ 2 లో భాష పై పట్టు సాధించేందుకు శిక్షణ ఉంటుంది.
* విమాన, వీసా చార్జీలు, ఫుడ్ వసతి అభ్యర్థులే భరించాలి. జర్మనీలో ఉద్యోగంలో చేరిన తర్వాత ఆరు నెలలకు ప్రవేశం పూర్తవుతుంది. ఆ ఆరు నెలల్లో ఖర్చులను మాత్రం తిరిగి చెల్లిస్తారు.