https://oktelugu.com/

JC Prabhakar Reddy: జెసి వర్సెస్ బిజెపి.. మధ్యలో నటి మాధవి లత

రాజకీయం అంటేనే రాయలసీమ. చిన్నపాటి కామెంట్స్ సైతం అక్కడ విపరీతంగా ప్రభావితం చూపుతాయి. ప్రస్తుతం అక్కడ జరుగుతోంది అదే.

Written By:
  • Dharma
  • , Updated On : January 4, 2025 / 01:17 PM IST

    JC Prabhakar Reddy(1)

    Follow us on

    JC Prabhakar Reddy: రాయలసీమలో బీజేపీ వర్సెస్ జెసి ప్రభాకర్ రెడ్డి అన్నట్టు పరిస్థితి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా పరిస్థితి కొనసాగుతోంది. తాడిపత్రిలో కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి బిజెపి మహిళా నేతలు తప్పు పట్టారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి. బిజెపి మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక రకమైన యుద్ధం కొనసాగుతోంది. జెసి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బిజెపి అన్నట్టు పరిస్థితి మారింది. డిసెంబర్ 31న తాడిపత్రిలో కొత్త సంవత్సరం వేడుకలకు జెసి ప్రభాకర్ రెడ్డి కేవలం మహిళలను మాత్రమే ఆహ్వానించారు. ఈ ఓన్లీ లేడీస్ పార్టీపై బిజెపి నేత మాధవీలత స్పందించారు. ఆ వేడుకలకు వెళ్ళొద్దని ఆమె మహిళలకు ఆపీల్ చేశారు. వేడుకలు నిర్వహించే ప్రాంతంలో గంజాయి సేవించేవారు ఎక్కువగా ఉంటారని.. ఆ ప్రాంతానికి వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని మాధవి లత ఒక వీడియోలో చెప్పారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బిజెపి నేత మాధవీ లత ప్రాస్టిట్యూట్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అసలు బిజెపిలో ఆమెను ఎందుకు తీసుకున్నారో తెలియదని.. ఆమె పెద్ద వేస్ట్ క్యాండిడేట్ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఇది పెద్ద వైరల్ అంశం గా మారింది. అక్కడితో ఆగకుండా జేసీ అనుచరులు బిజెపి నేత మాధవీలతపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టిడిపి మహిళా కౌన్సిలర్లు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో మాధవీలతపై కేసు నమోదయింది. అప్పటి నుంచి రచ్చ నడుస్తోంది. అదే సమయంలో మాధవి లత పై కేసు నమోదు చేయడంతో కొత్త కోణానికి దారితీసింది.

    * బస్సుల దగ్ధంతో
    అయితే అనూహ్యంగా జెసి ఫ్యామిలీకి చెందిన బస్సులు దగ్ధమయ్యాయి. అనంతపురం బస్టాండ్ ప్రాంగణంలో పార్కింగ్ చేసిన ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. అయితే ఈ ఘటన వెనుక బిజెపి నాయకుల హస్తం ఉందని జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బిజెపి కంటే జగన్ నయం అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేయనని.. పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కామెంట్స్ పై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    * గట్టిగానే అటాక్
    జెసి ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేత మాధవి లత స్పందించారు. ఆ వయసు అయిపోయిన మనిషి మాట్లాడుతున్న గొప్ప భాషకు ధన్యవాదాలు. ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం అంటూ వ్యంగంగా పేర్కొన్నారు. నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు. మహిళల మానప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను అంటూ మాధవి లత పేర్కొన్నారు. ఒంటరిగానైనా పోరాడుతానని స్పష్టం చేశారు. మరోవైపు జెసి కామెంట్స్ ను సినిమా పరిశ్రమకు జతకడుతూ ఆమె ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. సినిమాలో ఉన్న వాళ్లంతా ప్రాస్టిట్యూట్లని.. అందుకే సినీ పరిశ్రమకు ఎవరూ రావద్దంటూ మాధవి లత సూచించారు. తాడిపత్రిలో ఉండే వాళ్లు మాత్రమే మహిళలా.. మిగతావారు బజారు వాళ్ళ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ఆయన పెద్దరికం ఇదేనా అంటూ ప్రశ్నించారు. మొత్తానికైతే బిజెపి వర్సెస్ జెసి ప్రభాకర్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.