Ind Vs Aus 5th Test: బోర్డర్ – గవాస్కర్‌లో చివరి మ్యాచ్ సిన్నీ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. సిరీస్ స్వీప్ కాకుండా ఆడడంతోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. ఈనేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత పెరిగింది. సిరీస్‌లో ఆస్ట్రేలియా 2–1 ఆధిక్యంలో ఉంది. ప్రస్తుత మ్యాచ్‌లో టీమిండియా మ్యాటింగ్ చేసింది. కేవలం 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఆస్ట్రేలియాను కూడా మన బౌలర్లు 181 పరుగులకు కట్టడి చేశారు. దీంతో ఈ మ్యాచ్ కూడా మూడునాలుగు రోజుల్లో ముగిసే అవకాశం కనిపిస్తోంది. రెండో ఇన్సింగ్స్‌లో టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ఆసిస్ బ్యాటింగ్ సందర్భంగా మైదానంలో ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది.
యశశ్వి కామెంట్..
ఈ మ్యాచ్‌లో యశశ్వి జైశ్వాల్ నోటితో పంచ్‌లు వేశాడు. కాన్సన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్రో వాట్ హ్యాపెండ్.. నీ బ్యాట్ నుంచి రన్స్ రావడం లేదు. మేము చూడడాలి అనుకుంటున్నాం. అంటూ వ్యంగ్యంగా వ్యాక్యానించాడు. అయితే కాన్సన్ ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నాడు. దీంతో కామెంటేటర్స్ నవ్వుకున్నారు.
పింక్ క్యాప్‌తో..
ఇక ఈ టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పింక్ క్యాప్‌లో కనిపించారు. కొత సంవత్సర ప్రారంభంలో జరిగే ఈ టెస్టు మ్యాచ్ పింక్ టెస్టు అంటారు. ఎందుకంటే ఆటగాళ్లు పింక్ క్యాప్ ధరిస్తారు. రొమ్ము క్యాన్సర్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, దానితో పోరాడుతున్నవారికి ధైర్యం అందించడం దీని లక్ష్యం. ఈ ప్రచారాన్ని మెక్‌గ్రాత్ ప్రారంభించారు. అతని భార్య జేన్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత మెక్‌గ్రాత్ ఫౌండేషన్ స్థాపించారు. క్యాన్సర్‌తో పోరాడుతున్నవారికి సాయం అందిచాడు. అందుకే సిడ్నీ ‘కికెట్ కూడా ప్రతీ సంవత్సరం పిక్ టెస్టు మ్యాచ్ నిర్వహించడం ద్వారా మద్దతు ఇస్తుంది. ఈ మ్యాచ్ కోసం సిడ్నీ స్టేడియం గ్యాలరీలను కూడా గులాబీ రంగులో అలంకరించారు.
” ?”
What goes around, comes around! #Jaiswal giving #SamKonstas a taste of his own medicine, desi style! #AUSvINDOnStar 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/o7XAV0M5HU
— Star Sports (@StarSportsIndia) January 4, 2025