Janasena Party : జనసేన ( janasena )ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో మంచి ఫలితం దక్కింది. అందుకే పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. అధినేత పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే ఏర్పాటు చేస్తున్నారు. జనసేన ఏర్పాటు చేసి పది సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో.. ప్రతిష్టాత్మకంగా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను పక్కా ప్రణాళికలను సిద్ధం చేశారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి రెండు కీలక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈనెల 14న పిఠాపురంలో ఆవిర్భావ సభ జరగనుంది.
* కీలక నేతలతో కమిటీలు
ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాటులో… కీలక నేతలకు కమిటీల్లో స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే అనేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మంత్రి కందుల దుర్గేష్( Minister kondhula Durgesh ) తో కూడిన పదిమంది సభ్యులతో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, పడాల అరుణా లాంటి నేతలకు ఆ కమిటీలో ఛాన్స్ ఇచ్చారు. జన సమీకరణ కోసం జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో కీలక నేతలకు ఆ బాధ్యతలు అప్పగించారు.
Also Read : జనసేనకు గుడ్ న్యూస్.. తెలంగాణలో సైతం గుర్తింపు.. కల నెరవేరింది!
* సరిగ్గా 10 ఏళ్ల కిందట
2014 మార్చి 14న జనసేన( janasena ) ఆవిర్భవించింది. అయితే ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. ఏపీలో టీడీపీకి, జాతీయస్థాయిలో బిజెపికి మద్దతు తెలిపింది జనసేన. రెండు చోట్ల మద్దతు తెలిపిన పార్టీలే అధికారంలోకి వచ్చాయి. 2019 ఎన్నికల్లో తొలిసారిగా రంగంలోకి దిగింది జనసేన. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ సైతం ఓటమి చవిచూశారు. అయితే ఐదేళ్లు తిరగకముందే పడిలేచిన కెరటంలా మారింది జనసేన. సూపర్ విక్టరీని అందుకుంది.
* కీలక నిర్ణయాలు
జనసేన ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్నది పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ప్రణాళిక. ఒక ప్రాంతానికో.. ఓ కులానికో పరిమితం చేయకూడదని భావిస్తున్నారు ఆయన. అందుకే ఈసారి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేదిక నుంచి కీలక నిర్ణయాలు వెల్లడించనున్నారు. పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో నేతలు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
Also Read : జనసేనలోకి ఒకప్పటి టిడిపి నేత.. ఆ మాజీ మంత్రి మంత్రాంగం!