Janasena Incharge Kota Vinutha Arrest: దారుణాతీదారుణం. ఘోరాతి ఘోరం . ఊహించుకోవడానికి భయమేస్తోంది. అంతటి క్రూరానికి పాల్పడ్డారు. సాటి మనిషి అని కూడా జాలి చూపించలేదు. తమ దగ్గర పనిచేస్తున్నారని కనికరం కూడా ప్రదర్శించలేదు. అత్యంత రాక్షసంగా ప్రవర్తించారు. చివరికి అంతం చేశారు. ఈ ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. మనుషుల్లో రాక్షసత్వం పెరిగిపోతే ఎంతటి దారుణం జరుగుతుందో ఈ ఘటన నిరూపించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్చార్జిగా కోట వినూత పనిచేస్తున్నారు. ఈమె భర్త చంద్రబాబు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన జనసేన పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. వీరి వద్ద శ్రీనివాసులు రాయుడు అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. డ్రైవర్ మాత్రమే కాదు వినూతకు వ్యక్తిగత సహాయకుడిగా.. సలహాదారుడిగా కూడా అతడు కొనసాగుతున్నాడు. ఇటీవల వినోద రాయుడి పై సంచలన ప్రకటన చేశారు. అతడు తమ రాజకీయ విరోధులతో కలిసి పనిచేస్తున్నాడని.. తమను ఇబ్బంది పెడుతున్నాడని.. అందువల్లే అతడిని దూరం పెట్టామని.. ఇకపై మా వ్యవహారాలతో అతడికి సంబంధం లేదని ఆమె ఒక ప్రకటన చేశారు. దానిని శ్రీకాళహస్తిలోని మీడియా గ్రూపులలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రాయుడు కనిపించడం మానేశాడు. దీంతో అతడి గురించి ఆందోళన మొదలైంది. అతడి సన్నిహితులు అతని గురించి వెతకగా దారుణమైన నిజం బయటపడింది.
శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జిగా కొనసాగుతున్న వినూతకు రాయుడు డ్రైవర్ మాత్రమే కాదు పొలిటికల్ అడ్వైజర్, అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇటీవల చెన్నై సమీపంలో కూవం నదిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమయింది. దీనిపై అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతడు ఒంటి మీద ఉన్న గాయాలను పరిశీలించి హత్యకు గురయ్యాడని భావించారు. ఆ తర్వాత వారి పరిధిలో దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన యువకుడు వినూత డ్రైవర్ అని తేలింది. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాయుడిని గడిచిన 21వ తేదీ నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్టు వినూత సోషల్ మీడియా గ్రూపులలో ప్రకటించారు.. ఆ తర్వాత అతడు కొద్దిరోజుల నుంచి కనిపించడం మానేశాడు. అయితే అతడిని ఈనెల 8న తో గోదాంలో బంధించారు. చిత్రహింసలకు గురి చేశారు. అంతం చేసిన తర్వాత చెన్నై సమీపంలోని కూవం నదిలో పడేశారు. ఆ తర్వాత అతని మృతదేహం గురించి సమాచారం పోలీసులకు తెలియడంతో లోతుగా దర్యాప్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వినూత, ఆమె భర్త చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఈ ఘటనలో పాలుపంచుకున్న శివకుమార్, దాసర్, గోపిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రాయుడిని అంతం చేసిన తర్వాత వినూత విజయ గర్వంతో తన వాహన శ్రేణి తో కలిసి వచ్చినట్టు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.. దానికి సంబంధించిన రీల్ కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు, వినూత, ఇతర నిందితుల ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.
డ్రైవర్ ని హత్య చేసి, శవాన్ని రివర్ (నది) డెలివరీ చేసి సంబరాలు చేసుకుంటూ ర్యాలీగా వస్తున్న జనసేన సీనియర్ నేత, శ్రీకాళహస్తి ఇంచార్జ్ వినూత కోట దంపతులు.. pic.twitter.com/CwI6CVrDbq
— Anitha Reddy (@Anithareddyatp) July 12, 2025