https://oktelugu.com/

Former Minister RK Roja : మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగించేసిన జనసేన.. అడ్డంగా బుక్కైనట్టేనా?

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతల వైఫల్యాలు బయటపడుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి రోజా అవినీతిని బయటపెట్టింది జనసేన. ఆధారాలతో సహా సీఐడీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడింది. దీంతో రోజాకు ఇబ్బందులు తప్పేలా లేవు.

Written By:
  • Dharma
  • , Updated On : November 8, 2024 / 09:17 AM IST

    Former Minister RK Roja

    Follow us on

    Former Minister RK Roja : వైసిపి హయాంలో వివిధ శాఖల పనితీరుపై విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యం విధానంలో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 20వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయాన్ని పక్కదారి పట్టించారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో పర్యాటకశాఖ పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. వైసిపి హయాంలో ఆ శాఖలో నాలుగు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. అప్పట్లో టూరిజం శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉన్న సంగతి తెలిసిందే. పర్యాటకశాఖ తో పాటు క్రీడల శాఖను సైతం ఆర్కే రోజా చూసేవారు. ఈ తరుణంలో ఆడుదాం ఆంధ్ర పేరిట భారీ అవినీతి జరిగిందని తొలుత విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా పర్యాటక శాఖలో కూడా వందల కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్లు జనసేన ఆరోపిస్తోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కిరణ్ రాయల్ పూర్తి ఆధారాలతో సహా బయటపెట్టారు. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితో పాటు మల్లారెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. తిరుమల శ్రీవారి పేరు చెప్పి టూరిజం శాఖలో ప్రతిరోజు లక్ష రూపాయల లూటీ చేశారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లామని.. మొత్తం ఆధారాలతో సిఐడి కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి రోజా అవినీతి బాగోతం పై విచారణకు డిమాండ్ చేస్తున్నామని కిరణ్ రాయల్ పేర్కొన్నారు.

    * కిరణ్ రాయల్ దూకుడు
    కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జనసేన నేత కిరణ్ రాయల్ ఆర్కే రోజాపై దృష్టి పెట్టారు. వైసిపి హయాంలో అదే కిరణ్ రాయల్ పై రోజా టార్గెట్ చేస్తూ వచ్చారు. కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఒకటి రెండు సార్లు అరెస్టులు కూడా చేయించారు. ఈ నేపథ్యంలోనేరోజా అవినీతిపై దృష్టి పెట్టారు కిరణ్ రాయల్. పర్యాటక శాఖలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయటకు తీశారు. సిఐడికి ఫిర్యాదు చేయనున్నారు. అదే జరిగితే మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగిసినట్టే.

    * రోజా ఎలా స్పందిస్తారో?
    కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. వైసిపి ప్రభుత్వ హయాంలో చాలామంది మంత్రులు దూకుడుగా వ్యవహరించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడంతోపాటు సొంత శాఖల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా కావడానికి కారణమయ్యారు. వాటన్నింటిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వైసీపీ తాజా మాజీ మంత్రులపై వరుసగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పుడు జనసేన ఫిర్యాదుతో సిఐడి రంగంలోకి దిగనుంది. మాజీ మంత్రి రోజా శాఖపై విచారణ మొదలుకానుంది. వైసిపి అధికార ప్రతినిధిగా నియమితులైన రోజా గత కొంతకాలంగా రాష్ట్రానికి దూరంగా ఉన్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తన చుట్టూ ఉచ్చు బిగిస్తుండడంతో ఎలా స్పందిస్తారో చూడాలి.