Jagan Wedding Card: జగన్ పెళ్లి శుభలేఖ వైరల్.. అందులో మరో వివాహ ఆహ్వానం.. ఏం రాసి ఉందో తెలుసా?

సీఎం జగన్, భారతీలు 1996 ఆగస్టు 28న ఒక్కటయ్యారు. ఆరోజు ఉదయం 10:30 నిమిషాలకు భారతి మెడలో జగన్ తాళి కట్టారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో పెళ్లి జరిగింది.

Written By: Dharma, Updated On : December 12, 2023 9:44 am

Jagan Wedding Card

Follow us on

Jagan Wedding Card: ఏపీ సీఎం జగన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయ కార్యకలాపాలను సాగిస్తున్నారు. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అధికార పీఠాన్ని అందుకోగలిగారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం అందరికీ సుపరిచితమే.ఆయన భార్య భారతి రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. వీరికి పెళ్లి జరిగి 27 సంవత్సరాలు అవుతోంది. అయితే అవివాహానికి సంబంధించి పెళ్లి పత్రిక నెట్టింట్లో వైరల్ గా మారింది. శుభలేఖలు రెండు గంటలకు సంబంధించి ఆహ్వానం ఉండడం విశేషం.

సీఎం జగన్, భారతీలు 1996 ఆగస్టు 28న ఒక్కటయ్యారు. ఆరోజు ఉదయం 10:30 నిమిషాలకు భారతి మెడలో జగన్ తాళి కట్టారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో పెళ్లి జరిగింది. అయితే ఇదే ముహూర్త సమయానికి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పెళ్లి కూడా జరగడం విశేషం. వీరిద్దరి పెళ్లిళ్లకి సంబంధించి ఒకే శుభలేఖను వేయించారు. అప్పటికి జగన్ వయసు 24 ఏళ్లు. కడప జిల్లా పులివెందుల లయోలా కాలేజీ గ్రౌండ్స్ లో పెళ్లి వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. జగన్, భారతి దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె పేరు హర్షారెడ్డి, చిన్న కుమార్తె పేరు వర్షా రెడ్డి. హర్ష రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంటున్నారు. చిన్న కుమార్తె వర్షా రెడ్డి ప్యారిస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.

ఒకే రోజు ఒకే ముహూర్తాన.. సోదరుడు జగన్.. సోదరి సునీతల వివాహం జరగడం యాదృచ్ఛికమే అయినా.. వారి మధ్య గట్టి బంధం కొనసాగుతూ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ సొంత పార్టీని స్థాపించుకున్నారు. కానీ ఆయన బాబాయి వివేకానంద రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అటు తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ వెంట నడిచారు. ఈ క్రమంలో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. దీంతో కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. సోదరుడితో ఎంతో ఆత్మీయత ఉన్న సునీత దూరమయ్యారు. సునీతకు జగన్ సోదరి షర్మిల అండగా నిలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే వసుదైక కుటుంబం నిలిచిన.. వైయస్ కుటుంబం ఇప్పుడు అడ్డగోలుగా చీలిపోయింది. నాటి ఆత్మీయ అనుబంధాలను కుటుంబ సభ్యులు దూరం చేసుకున్నారు. ఇది వైయస్ కుటుంబ అభిమానులకు మింగుడు పడని విషయం.