Animal: ఒక స్టార్ హీరో ప్యాలెస్ ని అనిమల్ సినిమాలో హీరో ఇల్లు గా వాడారు…దాని ఖరీదు ఎంతంటే..?

రిచెస్ట్ మాన్ కొడుకు అవడంతో ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళ ఇల్లును ఎక్కడ తీసుకుందాం అని లొకేషన్ కోసం వెతుకుతున్నప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన భూషణ్ కుమార్ పదౌదా ప్యాలెస్ ఉందని దాన్ని చూపించి ఈ ప్యాలెస్ లో షూట్ చేద్దామని చెప్పాడంట.

Written By: Gopi, Updated On : December 12, 2023 9:35 am

Animal

Follow us on

Animal: ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అన్ని భాషల్లో వింపించే ఒకే ఒక సినిమా అనిమల్ ఈ సినిమాని సందీప్ రెడ్డివంగ తనదైన రీతిలో తెరకెక్కించి వసూళ్ల సునామిని సృష్టించాడు. ఇక ఇదే క్రమంలో ఈయన చేసిన ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమా హీరో రణ్బీర్ కపూర్ క్యారెక్టర్ సినిమాలో ఒక రిచెస్ట్ మాన్ కొడుకు అవడంతో ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళ ఇల్లును ఎక్కడ తీసుకుందాం అని లొకేషన్ కోసం వెతుకుతున్నప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన భూషణ్ కుమార్ పదౌదా ప్యాలెస్ ఉందని దాన్ని చూపించి ఈ ప్యాలెస్ లో షూట్ చేద్దామని చెప్పాడంట.

ఇక దాంతో ఆ ప్యాలెస్ లోనే ఇంటికి సంభందించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు.ఇక ఆ ప్యాలెస్ ఎవరిది అంటే బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన సైఫ్ అలీ ఖాన్ ది…ఈయన ప్రభాస్ హీరోగా వచ్చిన ఆది పురుషు సినిమాలో విలన్ (రావణుడి) గా నటించాడు. అయితే ఈ ప్యాలెస్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలని తెలుస్తుంది. ఇక ఈ ప్యాలెస్ కి కొన్ని కొట్లల్లోనే అనిమల్ మూవీ టీమ్ రెంట్ పే చేసినట్టు గా తెలుస్తుంది. ఒక సినిమా హీరో ప్యాలెస్ మరొక సినిమా హీరోకి రెంట్ గా ఇవ్వడం అనేది నిజంగా అద్భుతమైన చెప్పాలి.

ఇక సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి అనిమల్ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కి దానికి మించిన వసూళ్లను రాబడుతుంది ఇక ఈ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ గొప్పతనం ఏంటో అనేది మనకు అర్థం అవుతుంది. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వుడ్లలో సందీప్ రెడ్డి వంగ పేరు అనేది గట్టిగా వినిపిస్తుంది.

ఇక ఇప్పటికే ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు గానీ, హీరోలు గాని పోటీ పడుతున్నట్టు గా తెలుస్తుంది… నిజానికి బాలీవుడ్ లో సందిప్ రెడ్డి వంగ తెలుగు డైరెక్టర్ల అందరికీ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు అనేది మాత్రం వాస్తవం…ఇక ఇలాంటి డైరెక్టర్ ఇండస్ట్రీ లో ఉండటం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అదృష్టం అనే చెప్పాలి…