spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan : జగన్ ఓటుబ్యాంక్ ఫిక్స్.. ఆ నమ్మకంతో వైనాట్ 175

YS Jagan : జగన్ ఓటుబ్యాంక్ ఫిక్స్.. ఆ నమ్మకంతో వైనాట్ 175

YS Jangan : ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అధికార పక్షంపై కత్తులు నూరుతున్నాయి. అయినా సీఎం జగన్ లో ఆత్మ విశ్వాసం. వచ్చే ఎన్నికల్లో తనదే గెలుపు అంతులేని విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. పాలనా వైఫల్యాలు, ప్రజల్లో ఆశించిన స్థాయిలో కనిపించని సంతృప్తి ఉన్నా జగన్ లో మాత్రం గెలుపుపై నమ్మకం సడలడం లేదు. మొన్నటి వరకూ వైనాట్ 175 అని భారీ డైలాగులు విసిరినా..ఇప్పుడు మాత్రం అత్తెసరు మెజార్టీతోనైనా గద్దెనెక్కుతానని శపధం చేసి చెబుతున్నారు.

విపక్షాలన్నీ కలవాలన్న ప్రయత్నమే జగన్ ఎంత బలంగా ఉన్నారో చెబుతోంది. అయితే ఆయన రాజకీయంగా బలంగా ఉన్నారా? అంటే చెప్పలేని స్థితి. పోని రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించారా? అంటే అదీ కూడా లేదు. అయినా సరే రెండోసారి అధికారంలోకి వస్తానన్న ధీమా ఎలా అంటే మాత్రం చటుక్కున వచ్చే సమాధానం సంక్షేమ పథకాలు. తన ప్రభుత్వం నుంచి లాభం పొందిన వారు మాత్రమే తనకు ఆదరించాలని కోరుతుండడం కూడా జనాల్లో ఒకరకమైన ఆలోచన వస్తుందని జగన్ భావిస్తున్నారు. మొత్తం 3.98 కోట్ల మంది సంక్షేమ లబ్ధిదారులే తనను గెలిపిస్తారని నమ్మకంగా చెబుతున్నారు.

2019 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలపైనే జగన్ ఫోకస్ పెంచారు. ప్రజలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటేనే చాలని భావించారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తే అభివృద్ధి తానంతటే తానే సాధిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై భిన్న వాదనలు, విమర్శలు ఉన్నా పట్టించుకోలేదు. తన సుస్థిర ఓటు బ్యాంకుపైనే  దృష్టిసారించారు. ఏపీ ప్రజల్లో 87 శాతం మంది ప్రభుత్వ లబ్ధిదారులు ఉన్నారని.. వారంతా సానుకూలంగా ఆలోచిస్తే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

అయితే మొత్తం లబ్ధిదారుల లెక్క కట్టి మరీ గణాంకాలు చెబుతున్నారు. వారంతా సంతృప్తి చెందితే వైనాట్ 175 అసాధ్యం కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పెన్షనర్లు రూ 2750 చొప్పున అందుకుంటున్న వారి సంఖ్య 65 లక్షలు. ఆ తరువాతి స్థానంలో అమ్మ ఒడి లబ్ది దారులు 45 లక్షలు. రైతు భరోసా అందుకుంటున్న వారు 24 లక్షల మంది. పేదలకు ఇళ్ల పథకంలో లబ్ది దారులు 31 లక్షల మంది. అదే విధంగా వాహన మిత్ర..లా నేస్తం..జగనన్న చేదోడు వంటి లబ్దిదారులు ఉన్నారు.  తాజాగా ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ తనను మరోసారి గట్టెక్కిస్తాయని జగన్ నమ్మకంగా ఉన్నారు. కానీ ఆయన అనుకుంటున్నట్టుగా లబ్ధిదారులు ఆలోచిస్తున్నారో? లేదో? చూడాలి మరీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...

Spain Royal Family: స్పెయిన్‌ రాజవంశంలో కొత్త యుగం… 20 ఏళ్లకే సింహాసనం ఎక్కిన రాణి!

Spain Royal Family: స్పెయిన్‌ యూరప్‌లో చిన్న దేశం. ఇటీవల ఇరాన్‌ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం అమెరికా తీరును తప్పు పట్టింది. సైనిక స్థావరం ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వలేదు. వందల ఏళ్ల...
Oktelugu Epaper
Exit mobile version