Varahi Yatra : పవన్ వారాహి యాత్ర గోదావరి జిల్లాలో ఉరకలెత్తిన ఉత్సాహంతో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న యాత్ర జన సైనికులు, అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. యువకులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు యాత్రలో భాగస్థులవుతున్నారు. చివరకు చిన్నారులు సైతం పవన్ పట్ల విపరీతమైన అభిమానం చూపుతున్నారు. ఓ చిన్నారి అయితే ఏకంగా వారాహి వాహనం నమూనాను తయారుచేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఏకంగా పవన్ కళ్యాణ్ కు అందించేందుకు సిద్ధపడుతున్నాడు.
వారాహి యాత్ర ప్రకటించిన నాటి నుంచే ఒకరకమైన అంచనా ఉంది. అందునా ఉభయ గోదావరి జిల్లాలు అనేసరికి యాత్ర హిస్టరీ రిపీట్ చేస్తుందని అంతా భావించారు. అంతకు మించి జనాలు ఆదరణ కనబరుస్తున్నారు. అధికార పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యేలా నివేదకలు అందుతున్నాయి. సాధారణంగా జనసేన అంటేనే పెద్దగా జన సమీకరణ చేయరు. కానీ జన తాకిడి చూస్తుంటే మాత్రం అధికార పార్టీలో హీట్ పుట్టిస్తోంది. నేతలు కలరవపాటుకు గురవుతున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కు అభిమానుల నుంచి గిఫ్టులు వెల్లువెత్తుతున్నాయి. వాటిని పవన్ కూడా ఆప్యాయంగా స్వీకరిస్తున్నారు. జన సైనికుల అభిమానానికి ఫిదా అవుతున్నారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేనకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి శ్రీనివాస్ కుమారుడు వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా పవన్ ప్రసంగిస్తున్న వారాహి వాహనం నమూనాను ఆకర్షవంతంగా తయారుచేశాడు. సుమారు 10 రోజులు కష్టపడి వాహనాన్ని రూపొందించాడు. నరసాపురం సభలో అందించేందుకు సిద్ధపడుతున్నాడు. ఆ బుడతడును జన సైనికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.



