https://oktelugu.com/

Jagan: బెంగళూరుకు జగన్ షిఫ్ట్.. తాడేపల్లి ప్యాలెస్ కంచ బద్దలు

ఈ ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు. అక్కడ ఆయనకు విలాసవంతమైన యలహంక ప్యాలెస్ ఉంది. అక్కడ నుంచి తాడేపల్లికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ లో కొన్ని రకాల నిర్మాణాలు జరుగుతుండడంతో.. జగన్ బెంగళూరుకు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రచారం ప్రారంభం అయింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 12, 2024 / 11:34 AM IST

    YS Jagan

    Follow us on

    Jagan: మాజీ సీఎం జగన్ బెంగళూరుకు వెళ్లిపోనున్నారా? తాడేపల్లి ప్యాలెస్ ను ఖాళీ చేయనున్నారా? అక్కడైతే సేఫ్ అని భావిస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే రకమైన చర్చ నడుస్తోంది. జగన్ మకాం మార్చుతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్ లో కొన్ని రకాల మార్పులు చేస్తున్నారు జగన్. ఈ క్రమంలో తాడేపల్లి ప్యాలెస్ లో క్రేన్ తో పనులు జరుగుతున్న ఓ ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అటు వాట్సాప్ లోను అదే రకమైన ప్రచారం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం, ఇంకోవైపు కేసులు వెంటాడుతుండడంతో జగన్ బెంగళూరు షిఫ్ట్ అవుతున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వార్తలో నిజం ఎంత? అసలు తాడేపల్లి నివాసంలో ఏం జరుగుతోంది? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల జగన్ తన ఇంటికి కొన్ని చేర్పులు మార్పులు చేస్తున్నారు. వాస్తు దోషం తోనే తనకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాడేపల్లి ని విడిచిపెట్టి బెంగళూరు వెళ్లిపోతారని ప్రత్యర్థులు ప్రచారం చేయడం ప్రారంభించారు.

    * టిడిపి ఖాతాల నుంచి పోస్టులు
    వైయస్ జగన్ ను ఉద్దేశించి..’తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్ కు షిఫ్ట్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి’అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఎక్స్ లో ‘@yash TDP’ అనే ఖాతా నుంచి ఈ పోస్ట్ చేశారు. ఇక ఫేస్బుక్ లోను ‘meme ra Pushpa’ అనే ఖాతా నుంచి ఇదే రకమైన పోస్ట్ చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవైపు వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు టిడిపి సోషల్ మీడియా చేస్తున్న పని ఏంటని ప్రశ్నిస్తున్నారు.

    * వాస్తు మార్పులు
    వాస్తవానికి తాడేపల్లిలో వైయస్ జగన్ నివాసంలో కొన్ని రకాల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చిన్న చిన్న మార్పులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి చుట్టూ ఉన్న గ్రిల్స్ ను తొలగిస్తున్నారు. అయితే ఈ మార్పులు ఎందుకు చేస్తున్నారన్న దానిపై స్పష్టత లేదు. అయితే వాస్తు నిపుణుల సూచనలు మేరకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై సైతం ప్రచారం మొదలుపెట్టారు. కొన్ని రోజుల కిందట ఇంటి దక్షిణ దిశలో కంచెను తొలగించారు. డిసెంబర్ 9న తూర్పు ఈశాన్యం వైపు ఉన్న కంచెలో కొన్ని వరుసలను తొలగించారు. మొత్తానికి అయితే జగన్ ఇంటికి ఇలా వాస్తు మార్పులు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.