Jagan : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో సమూల ప్రక్షాళనకు దిగారు జగన్మోహన్ రెడ్డి. కీలక నియామకాలు చేపడుతున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 11 స్థానాలకు పరిమితం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నిరాశ అలుముకుంది. మరోవైపు పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. కీలక నేతలు సైతం రాజీనామా బాట పట్టారు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తూనే.. పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని విస్తరించారు. కీలక నేతలకు చోటు కల్పిస్తూ కొత్త కమిటీని ఏర్పాటు చేశారు.
Also Read : బట్టలూడదీస్తావా? జగన్ జాగ్రత్తగా మాట్లాడు.. ఎస్ఐ మాస్ వార్నింగ్!
* సోషల్ మీడియా వింగ్ యాక్టివ్..
గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు గమనిస్తే సోషల్ మీడియా( social media) ఆక్టివ్ అయింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తోంది. అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి సోషల్ మీడియా వింగ్ ను చూసేవారు. అయితే ఆయన స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఒక విధంగా సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా పని చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతోంది. నేతలు కూడా చాలా యాక్టివ్ అవుతున్నారు. ఇటువంటి తరుణంలోనే పార్టీలో అత్యంత కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో పాటు అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేయడానికి నడుం బిగించారు జగన్మోహన్ రెడ్డి.
* రాజకీయంగా కీలక కమిటీ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయపరమైన నిర్ణయాన్ని పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో( political Advisory Committee ) తీసుకుంటారు. అటువంటి కమిటీకి చైర్మన్గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. మరో 30 మందికి పైగా నేతలకు కమిటీలో ఛాన్స్ ఇచ్చారు. పీఏసీ కమిటీలో తమ్మినేని సీతారాం, పినిపే విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగాం సురేష్, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, పీడిక రాజన్న దొర, బెల్లాన చంద్రశేఖర్, గొల్ల బాబురావు, బూడి ముత్యాల నాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పుప్పాల శ్రీనివాసరావు, చెరుకూరి శ్రీ రంగనాథరాజు, కోన రఘుపతి, విడతల రజిని, ఆర్కే రోజా, బొల్లా బ్రహ్మనాయుడు, నల్లమలుపు ప్రసన్న కుమార్ రెడ్డి, కే నారాయణస్వామి, అవినాష్ రెడ్డి, షేక్ అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, మాల గుండ్ల శంకరనారాయణ, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, సాకే శైలజానాథ్ వంటి వారిని నియమించారు జగన్మోహన్ రెడ్డి.
* సజ్జల నియామకం పై సీనియర్ల కీనుక
అయితే కమిటీ సభ్యులుగా సీనియర్లు ఉన్నారు. కానీ ఈ కమిటీకి అధ్యక్షుడిగా సజ్జల రామకృష్ణారెడ్డిని( sajjala Ramakrishna Reddy) నియమించడం సీనియర్లకు రుచించడం లేదు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేవారు. ఆయనను తొలగించి సమన్వయకర్తగా పులివెందులకు చెందిన సతీష్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి పిఎసి కమిటీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం చూస్తుంటే.. సమన్వయ బాధ్యతలు సతీష్ రెడ్డికి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి అయితే పొలిటికల్ అడ్వైజరీ కమిటీని విస్తరించడం ద్వారా.. మున్ముందు మరింత దూకుడుగా ఉంటామని సంకేతాలు పంపగలిగారు జగన్మోహన్ రెడ్డి.
Also Read : వైఎస్ అడ్డాలో టిడిపి పండుగ.. ఏర్పాట్లు షురూ