Jagan: బెంగళూరుకు మకాం మార్చనున్న జగన్.. కారణం అదే!

ఏపీలో వైసిపి దారుణ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను వెంటాడి, వేటాడారు. ఇంతవరకు ఎవరు సాహసం చేయని విధంగా చంద్రబాబును టచ్ చేశారు. అవినీతి కేసుల్లో అరెస్టు చేసి 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచగలిగారు.

Written By: Dharma, Updated On : June 26, 2024 5:15 pm

Jagan

Follow us on

Jagan జగన్ ఇక ఏపీలో ఉండరా? హైదరాబాదులో ఉండేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదా? తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారా? బెంగళూరు మకాం మార్చనున్నారా? అక్కడ అయితే సేఫ్ జోన్ గా భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. జగన్ కు తాడేపల్లి ప్యాలెస్ తో పాటు హైదరాబాదులో లోటస్ పాండ్ ఉంది. అటు బెంగళూరులో యలహంక ప్యాలెస్ సైతం ఉంది. వీటితో పాటు పులివెందులలో భారీ ఇంద్రభవనమే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో తనకు ప్రత్యర్ధులు ఎక్కువగా ఉండడంతో.. బెంగళూరులో నివాసం ఏర్పాటు చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో వైసిపి దారుణ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను వెంటాడి, వేటాడారు. ఇంతవరకు ఎవరు సాహసం చేయని విధంగా చంద్రబాబును టచ్ చేశారు. అవినీతి కేసుల్లో అరెస్టు చేసి 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచగలిగారు. దాదాపు రాజకీయ ప్రత్యర్థులందరినీ టార్గెట్ చేసుకున్నారు. కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో తనపై రివేంజ్ ఆ స్థాయిలో ఉంటుందని జగన్ కు తెలుసు. పోనీ హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటే అక్కడ సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు. చంద్రబాబుకు అనుంగ శిష్యుడు. ఆపై జగన్ వ్యతిరేకిగా ముద్ర పడ్డారు. కనీసం తెలంగాణ సీఎంగా ఎన్నికైన తర్వాత రేవంత్ కు శుభాకాంక్షలు తెలపలేదు. అందుకే జగన్ కు చెందిన లోటస్ ఫండ్ లో అక్రమ నిర్మాణాలను సైతం తొలగించారు. జగన్ పై రివెంజ్ పాలిటిక్స్ ఏ స్థాయిలో ఉంటుందో సంకేతాలు ఇచ్చారు. అందుకే హైదరాబాదులో ఉండకూడదని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఏపీ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు కంటే లోకేష్ అంటేనే జగన్ ఎక్కువగా భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తప్పు చేసిన నేతలు, అధికారుల పేర్లతో లోకేష్ రెడ్ బుక్ రాసిన సంగతి తెలిసిందే. ఆయన బుక్ లో ఉన్న వారంతా ఇప్పుడు టార్గెట్ అవుతున్న సంగతి విధితమే. అందుకే లోకేష్ అంటేనే జగన్ ఎక్కువగా భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. కేంద్రంలో సైతం చక్రం తిప్పుతోంది. ఈ తరుణంలో జాతీయ స్థాయిలో సైతం మద్దతు అవసరం. అందుకే కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన డీకే శివకుమార్ ను జగన్ ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఐదు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే.. తన వైసీపీని విలీనం చేస్తానని కూడా జగన్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే బెంగళూరులోని యెలహంక ప్యాలెస్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.