Engineering Counseling: తెలంగాణ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ మార్పు.. ఎప్పటి నుంచంటే..!

కొత్త షెడ్యూల్‌ ప్రకారం జూలై 4 నుంచి ఇంజినీరింగ్‌ తొలి విడత ప్రవేశ ప్రక్రియను ప్రారంభిస్తారు. జూలై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, జూలై 8 నుంచి 15 వరకు తొలి విడత వెబ్‌ ఆప్షన్‌లకు అవకాశం కల్పిస్తారు. జూలై 19న ఇంజినీరింగ్‌ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : June 26, 2024 5:15 pm

Engineering Counseling

Follow us on

Engineering Counseling: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌/బీఈ సీట్ల భర్తీకి నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. జూన్‌ 27 నుంచి ప్రారంభించాల్సిన కన్సెలింగ్‌ ప్రక్రియ షెడ్యూల్‌ను వాయిదా వేసింది.

జూలై 4 నుంచి..
కొత్త షెడ్యూల్‌ ప్రకారం జూలై 4 నుంచి ఇంజినీరింగ్‌ తొలి విడత ప్రవేశ ప్రక్రియను ప్రారంభిస్తారు. జూలై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, జూలై 8 నుంచి 15 వరకు తొలి విడత వెబ్‌ ఆప్షన్‌లకు అవకాశం కల్పిస్తారు. జూలై 19న ఇంజినీరింగ్‌ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

జూలై 26 నుంచి రెండో విడత..
ఇక ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ జూలై 26 నుంచి నిర్వహిస్తారు. 27న రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపడతారు. జూలై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. జూలై 31న ఇంజినీరింగ్‌ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు.

ఆగస్టు 8 నుంచి మూడో విడత..
ఇక మూడో విడత కౌన్సెలింగ్‌ను ఆగస్టు 8 నుంచి ప్రారంభిస్తారు. ఆగస్టు 9 నుంచి మూడో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఆగస్టు 13న ఇంజినీరింగ్‌ మూడో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 21 నుంచి కన్వీనర్‌ కోటా ఇంటర్నల్‌ స్లైడింగ్‌కు అవకాశం కల్పిస్తారు.