Jagan Going to Tenali Unexpected : వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )తడబడినట్టు కనిపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రజా సమస్యలపై పోరాటం చేయవచ్చు. కానీ ఏడాదిగా జగన్మోహన్ రెడ్డి నుంచి అటువంటి పోరాటాలు ఆశించలేం. ఎందుకంటే ఏడాది కాలంగా ప్రజా పోరాటాలు ఏవి చేయలేదు. బాధితుల పక్షాన పోరాటం చేయలేదు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పరామర్శలకు ఆయన పరిమితం అయ్యారు. మధ్యలో ఒకసారి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి అక్కడి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అంతకుమించి ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేసిన దాఖలాలు లేవు. అయితే రేపు తెనాలి వెళుతున్నారు. అక్కడ మానవ హక్కులకు భంగం కలిగిందని చెబుతూ బాధితుల పరామర్శకు బయలుదేరనున్నారు. అయితే జగన్ వైఖరి పై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* సోషల్ మీడియాలో హల్చల్..
తెనాలిలో( Tenali) కొద్ది రోజుల కిందట పోలీసులు ముగ్గురు యువకులపై లాఠీలతో కొట్టడం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకుల కాళ్లపై విచక్షణారహితంగా కొడుతుండగా.. బాధిత యువకులు ఆర్తనాదాలు చేశారు. అయితే నెల రోజుల కిందటే ఈ ఘటన జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. పౌర హక్కులకు, మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆరోపిస్తోంది. అందుకే బాధితులకు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత పరామర్శించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే తెనాలి తో పాటు స్థానికులు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారినే పరామర్శిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డామేజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు.
Also Read : మోడీ–జగన్ సంబంధానికి బీటలు.. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సరికొత్త చర్చ
* పోలీసుల వెర్షన్ అలా..
అయితే ఈ ఘటనపై పోలీసులతో పాటు స్థానికుల వెర్షన్ వేరేలా ఉంది. సదరు ముగ్గురు యువకులు ఓ రోజు పట్టణ శివారులో మద్యం తాగుతున్నారు. అటువైపుగా వెళ్తున్న కానిస్టేబుల్ను పిలిచి మరి ఆయన పై దాడికి పాల్పడ్డారు. అది కూడా గంజాయి మత్తులో. అప్పటికే వారిపై తొమ్మిది వరకు కేసులు ఉన్నాయి. ఓ రౌడీ షీటర్ ( rowdy sheeter) వద్ద వారు పనిచేస్తున్నారు. ఏకంగా ఓ కానిస్టేబుల్ పై హత్య ప్రయత్నం చేయడానికి పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. స్థానికంగా వారి అరాచకాలపై ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో పోలీసులు అలా చేయాల్సి వచ్చింది. మత్తు పదార్థాల మాటున రౌడీయిజం చేస్తున్న వారిలో కనువిప్పు కలిగించాలని అలా చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం ఏమిటనేది స్థానికంగా వినిపిస్తున్న మాట. దీనిపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నేరం చేసిన వాడి కులం చూడడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కుల రాజకీయాలు ఏంటని నిలదీసినంత పనిచేశారు.
* కానిస్టేబుల్ భార్య ఆవేదన..
మరోవైపు ఆ ముగ్గురి చేతిలో గాయపడిన కానిస్టేబుల్( constable) భార్య తెరపైకి వచ్చారు. తన భర్త పై గంజాయి మత్తులో వారు దాడికి పాల్పడిన విషయాన్ని చెప్పుకొచ్చారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ లపై చేయి చేసుకుంటే.. తిరిగి వారికి వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. అయితే ఇప్పటికే తెనాలి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తగ్గేది లే అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరి కడపలో ఏం జరగబోతుందో చూడాలి.