Raja Saab Release Date : ‘కల్కి’ తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆరు నెలలకు ఒక సినిమాని విడుదల చేస్తాను, కుదిరితే మూడు సినిమాలు కూడా నా నుండి రావొచ్చు అంటూ అభిమానులకు మాట ఇచ్చాడు ప్రభాస్. కానీ ఈ ఏడాది ఆయన నుండి ఒక్క సినిమా కూడా విడుదల అవ్వదేమో అని అభిమానులు భయపడ్డారు. ఎందుకంటే హీరో ఇండియా లో కంటే ఎక్కువ యూరోప్ లో ఉంటున్నాడు. ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రం కంటే ఎక్కువగా హను రాఘవపూడి మూవీ పైనే ఫోకస్ పెడుతున్నాడు, ముందుగా ఏ సినిమా వస్తుందో చెప్పలేని పరిస్థితి అంటూ అభిమానులు సోషల్ మీడియా లో ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అభిమానుల కోసం ఇప్పుడు ఒక శుభవార్త. ‘రాజా సాబ్’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 12 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ నెల 15న కానీ, 16వ తేదీన కానీ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ప్రభాస్ కి సంబంధించి కేవలం పది రోజుల టాకీ పార్ట్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. అది కాకుండా మరో 15 రోజులు పాటల చిత్రీకరణ ఉంటుందని సమాచారం. మారుతీ దర్శకత్వం తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం కూడా షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. వాస్తవానికి థమన్ ఇచ్చిన ట్యూన్స్ ని మళ్ళీ రీ కంపోజ్ చేశారట. అందుకు చాలా సమయం పట్టిందని తెలుస్తుంది. అంతే కాకుండా జూన్ 15 న విడుదల చేయబోయే టీజర్ లో సినిమా విడుదల తేదీని కూడా పొందుపరుస్తారని తెలుస్తుంది.
Also Read : ప్రభాస్ ‘రాజా సాబ్’ ఆ చిత్రానికి రీమేకా..? ఆసక్తి రేపుతున్న తలుపుల స్టోరీ!
వాస్తవానికి ఈ సినిమా టీజర్ ని ఈ నెల 12 న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం తో అటాచ్ చేసి విడుదల చేయాలని అనుకున్నారట. కానీ రీ రికార్డింగ్ వర్క్ పూర్తి అవ్వకపోవడంతో మేకర్స్ 15 న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. అభిమానులు ఈ చిత్రాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు కానీ, సినిమా మాత్రం వేరే లెవెల్ లో వచ్చిందని, దేశవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించే ప్రకంపనలు మామూలు రేంజ్ లో ఉండవని అంటున్నారు. టీజర్ కూడా చాలా అద్భుతంగా కట్ చేశారట. ఇప్పటికే మోషన్ పోస్టర్ ద్వారా ఆడియన్స్ కి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కాస్త హాలీవుడ్ హ్యారీ పోటర్ వెబ్ సిరీస్ తో పోలి ఉంటుందని తెలుస్తుంది.