Jagan Speech Mistakes: ఎంతటి వారైనా నోరును అదుపులో పెట్టుకోవాలి. లేకుంటే కష్టమే. ముందుగా ప్రజాక్షేత్రంలో ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందునా సోషల్ మీడియా( social media) రాజ్యమేలుతున్న రోజులు ఇవి. క్షణాల్లో వైరల్ అయిపోతాయి. ఒక్కోసారి ప్రజల్లో పలుచన చేస్తాయి. చాలామంది రాజకీయ పార్టీల నేతలు ఇలా నోరు జారడానికి సంబంధించి బాధితులే. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే మాదిరిగా ట్రోల్ అవుతున్నారు. ఆయన నిన్ననే మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చిన తప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే పనిగా టోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియా వచ్చాక..
సోషల్ మీడియా వచ్చాక రాజకీయ ప్రత్యర్థులు మాటు వేసి తప్పులు వెతికే పనిలో పడతారు. గతంలో నారా లోకేష్( Nara Lokesh) విషయంలో అదే జరిగింది. లోకేష్ మాట్లాడిన క్రమంలో ఎక్కడికక్కడే తప్పిదాలు, తప్పులు దొర్లేవి. చివరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ పేరు సంబోధించే సమయంలో కూడా ఆయన వ్యతిరేకులు ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరు నాయకులు పొరపాటున ఆడిన మాటలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో సైతం అదే తరహా కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.
Also Read: Hindupur TDP Strategy: నందమూరి బాలకృష్ణ నెత్తిన పాలు పోసిన జగన్!
రెండుసార్లు అలానే..
సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )చాలా పదాలు పలకులేరు. చాలాసార్లు తప్పులు కూడా దొర్లాయి. తాజాగా నిన్ననే ఆయన మీడియాతో మాట్లాడే క్రమంలో అదే తరహా వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో అధికారులు అత్యుత్తమంగా పనిచేశారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అతియుత్తంగా అని సంబోధించారు. అంతటితో ఆగకుండా తాము సంస్కరణలు అమలు చేశామని చెప్పే క్రమంలో సన్ స్కరణలు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ రెండు తప్పులను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. గతంలో కూడా ‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి’ అనే సామెతను ఉదహరించే క్రమంలో చాలాసేపు తడబడ్డారు. అప్పుడు కూడా ట్రోల్ కు గురయ్యారు. ‘ఎవడు మమ్మీ వీడు’ అనే నేమ్స్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా అన్న ఈరోజు వదిలిన మరో రెండు బాణాలు అంటూ.. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టు వైరల్ అవుతోంది.