Homeఆంధ్రప్రదేశ్‌Hindupur TDP Strategy: నందమూరి బాలకృష్ణ నెత్తిన పాలు పోసిన జగన్!

Hindupur TDP Strategy: నందమూరి బాలకృష్ణ నెత్తిన పాలు పోసిన జగన్!

Hindupur TDP Strategy: హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) ఉన్నారు. ఆయన హ్యాట్రిక్ సాధించారు. మూడోసారి విజయాన్ని దక్కించుకున్నారు. 2014లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు హిందూపురం నుంచి. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచారు. నాడు రాయలసీమలో మూడు స్థానాల్లో టిడిపి గెలిచింది. అందులో హిందూపురం ఒకటి. ఆది నుంచి హిందూపురం టిడిపికి కంచుకోట. ఇంతవరకు అక్కడ టిడిపికి ఓటమి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. కానీ వర్క్ అవుట్ కాలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు ప్రయత్నించింది కానీ.. హిందూపురం ను కదిలించలేకపోయింది. అయితే 2029 లోనూ డౌటేనని తెలుస్తోంది. ఎందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరే కారణం.

సర్వశక్తులు ఒడ్డిన పెద్దిరెడ్డి
2024 ఎన్నికల్లో బాలకృష్ణను హిందూపురంలో( Hindu Puram ) ఓడించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. అక్కడ అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్చార్జిగా ఉండేవారు. తన సొంత నియోజకవర్గం పుంగనూరు కంటే ఆయన ఎక్కువగా హిందూపురం పైనే దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. ఆపై టిడిపి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆకర్షించారు. టిడిపిలోని పేరు మోసిన నేతలపై ఒత్తిడి చేసి పార్టీ మారేలా చేశారు. అయినా సరే బాలకృష్ణను హిందూపురంలో ఓడించలేకపోయారు. అంతలా అక్కడ సంస్థాగత బలం పెంచుకుంది తెలుగుదేశం పార్టీ. ఆపై ఎదురు పార్టీల్లో నేతల మధ్య విభేదాలు సైతం తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తున్నాయి.

Also Read: Mithun Reddy SIT Case: పెద్దిరెడ్డి అరెస్ట్.. బలమైన ఆధారాలతో సిట్!

మహిళా నేతకు పరాజయం..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అభ్యర్థిగా దీపిక అనే మహిళ నేతను బరిలోదించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆమె ఓడిపోయారు. అయితే ఆమె పూర్తిగా నియోజకవర్గానికి అందుబాటులో లేనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి. అయితే ఇప్పుడు వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వేటు వేసినట్లు తెలిపారు. ఇటీవల ఓ సమావేశంలో నవీన్ నిశ్చల్ 2029 లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీనిపై దీపిక వర్గం ఫిర్యాదు చేయడంతోనే వారిపై వేటు పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామంతో ఆ ఇద్దరు నేతలు టిడిపిలో చేరే అవకాశం ఉంది.

రకరకాలుగా ప్రయోగం..
గత ఎన్నికలకు ముందు హిందూపురం విషయంలో చాలా రకాల ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). నందమూరి బాలకృష్ణ ప్రధాన అనుచరులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చారు. చాలా రకాల ప్రలోభాలకు గురి చేశారు. అయినా సరే హిందూపురంలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచలేకపోయారు. ఇప్పుడు ఏకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలపై సస్పెండ్ వేటు పడడంతో అక్కడ టిడిపి మరింత బలపడినట్లు అవుతోంది. అయితే బాలకృష్ణ విషయంలో జగన్మోహన్ రెడ్డి మేలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular