Jagan: ఏపీలో( Andhra Pradesh) రాజకీయ పార్టీలకు అనుగుణంగా మీడియా రంగం మారిపోయింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాను ఎల్లో మీడియా గాను.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాను నీలి మీడియా గాను అభివర్ణిస్తున్నారు. ఇక తటస్థ మీడియా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ వస్తోంది. ఫలానా పత్రిక ఫలానా పార్టీది.. ఫలానా ఛానల్ ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది అని ప్రజలు చెప్పుకునే స్థాయికి మీడియా చేరింది. అయితే ఒక్క తెలుగు నాటి కాదు.. అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి అనుకూల మీడియాలు తాము అభిమానించే పార్టీల కోసం పనిచేయడమే కాదు.. అవి ప్రమాదంలో ఉన్నప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంటాయి. ఇప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ అదే చేస్తున్నారు.
Also Read: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారు కూడా అర్హులే..
* టిడిపి అనుకూల ముద్ర
సాధారణంగా ఆంధ్రజ్యోతి( Andhra Jyothi) అంటేనే తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే నిత్యం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఈ మీడియా ప్రవర్తన. కానీ ఇటీవల ఆ మీడియా వైఖరిలో మార్పు వస్తోంది. కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలతో పాటు యంత్రాంగం లోపాలను సైతం ఎత్తిచూపుతోంది ఆ మీడియా. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే ఈ వ్యతిరేక కథనాల్లో కూడా టిడిపి పట్ల అనుకూలత కనిపిస్తోంది. తాజాగా రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లో జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయకూడదు అంటూ రాసిన వ్యాసం ఆలోచింపచేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఆనందం ఇస్తోంది.
* అత్యంత క్లిష్ట సమయం..
2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ). కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 11 సీట్లకు పరిమితం అయింది. పార్టీలో కీలక నేతలంతా ఓడిపోయారు. ఇక పార్టీకి భవిష్యత్తు లేదనుకున్న చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీల్లో చేరిపోయారు. అయితే ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి కోలుకోలేరని అంతా భావించారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అంటూ కథనాలు ప్రచురించింది. అందులో ఆంధ్రజ్యోతి కూడా ఒకటి. గత ఐదేళ్ల పాలనలో వైఫల్యాలు, రాజకీయ తప్పిదాలు వంటి వాటిపై పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశాయి.
* జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా..
అయితే తాజాగా వేమూరి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లో( weekend comment) జగన్మోహన్ రెడ్డి పై అనుకూలంగా రాసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు.. కోలుకునేసరికి రెండేళ్లు పట్టిందని.. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా కాదన్నారు. ఒకవైపు ఓటమి.. మరోవైపు పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లిపోయిన జగన్మోహన్ రెడ్డి ధైర్యంతో ముందడుగు వేసారని.. త్వరగా కోలుకున్నారని రాసుకు వచ్చారు రాధాకృష్ణ. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి అనుకూల అంశంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కానీ టిడిపి శ్రేణులను అప్రమత్తం చేసేందుకే రాధాకృష్ణ అలా వీకెండ్ కామెంట్లో రాశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ప్రత్యక్ష రాజకీయాలకు ఆ మంత్రి గుడ్ బై.. తెరపైకి వారసుడు?