Central Govt: అయితే ఈ ముఖ్యమైన పత్రాలలో పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ వంటివి మార్చాలంటే ప్రజలు వేరువేరు కార్యాలయాలను సందర్శించాలి. తాను ఇకపై అటువంటి అవసరం ఉండదు. ఈ పత్రాలు అన్నిటికీ సంబంధించి ఒకే చోళ సేవలు అందించేలాగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత డిజిటల్ గుర్తింపు వ్యవస్థను త్వరలో అమలు చేయడానికి రెడీగా ఉంది. ఈ పోర్టల్లో ప్రజలు ఇకపై ఒకే చోట ఇంటి చిరునామా, పేరు, మొబైల్ నెంబర్ వంటి సమాచారాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. అవసరమైన అన్ని గుర్తింపు కార్డులలో ఈ మార్పులు స్వయంచాలకంగా అప్డేట్ అవడం జరుగుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అలాగే పాస్పోర్ట్ వంటి అన్ని గుర్తింపు కార్డులను ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి ఒక పోర్టల్ ను రూపొందించనుంది. ఈ గుర్తింపు కార్డులలో మీకు అప్డేట్ కోసం మీరు ఆ పోర్టల్ కి వెళ్లి ఆప్షన్ను ఎంచుకోవలసి ఉంటుంది.
Also Read: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారు కూడా అర్హులే..
ఈ పోర్టల్ లో మీకు మొబైల్ నెంబర్ మార్చడానికి అలాగే చిరునామా వంటి ఇతర సమాచారం కూడా మార్చడానికి ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. ఉదాహరణకు మీరు చిరునామా మార్చాలని అనుకుంటే దానికి సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాలి. మీరు మార్చిన చిరునామా 3 నుంచి 10 దినాలలో అన్ని పత్రాలలో కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మార్చిన సమాచారంతో మీరు కొత్త గుర్తింపు కార్డును కూడా పొందవచ్చు. దీనికోసం అయ్యే రుసుమును చెల్లించి పోర్టల్ లో కొత్త గుర్తింపు కార్డు కోసం అప్లై చేసుకోవాలి. కొత్త అప్డేట్ తో కూడిన కొత్త గుర్తింపు కార్డు మీకు ఏడుపని దినాలలో మీ ఇంటికి పోస్టు ద్వారా అందుతుంది. ఒకవేళ ఇంటికి కాకుండా కార్యాలయం ద్వారా గుర్తింపు కార్డు పొందాలనుకుంటే దానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది.
మీరు సమాచారం అప్డేట్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో అప్డేట్ చేసిన గుర్తింపు కార్డును కార్యాలయానికి వచ్చి కొందే తేదీతో పాటు సమయం కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ట్రయల్ రన్ జరుగుతుంది. త్వరలోనే ఇది అందుబాటులోనికి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కానీ దీనికి కొన్ని సాంకేతిక మరియు చట్టపరమైన సమస్యలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇవన్నీ చివరి దశ పరిష్కారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ పోర్టల్ ద్వారా డేటాను సురక్షితంగా ఉంచడానికి పూర్తి ఆధారిత వ్యవస్థను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ట్రావెల్ గ్రామంలో 92 శాతం వరకు కచ్చితత్వం ఉన్నట్లు తెలిసింది. 98% కంటే ఎక్కువ ఖచ్చితత్వం పొందిన తర్వాత దీనిని సాధారణ ప్రజల కోసం ప్రారంభిస్తారు. కానీ ఈ పోర్టల్ పేరు ఇంకా నిర్ణయించలేదని తెలుస్తుంది.