AP DSC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. SC, ST, BC, దివ్యాంగ అభ్యర్థుల కోసం డిగ్రీలో అర్హత మార్కులను 45% నుంచి 40%కి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వేలాది అభ్యర్థులకు ఉపాధ్యాయ వృత్తిలో అవకాశాలను మరింత సులభతరం చేస్తుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
Also Read: పహల్గాంకు నటుడు.. ఇతడి గుండెధైర్యం, స్ఫూర్తికి అంతా సలాం!
అభ్యర్థుల ఆందోళనలకు స్పందన..
గతంలో DSC నియామకాల కోసం డిగ్రీలో 45% మార్కులను తప్పనిసరి చేసిన నిబంధనపై SC, ST, BC, దివ్యాంగ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఎడ్, టెట్ అర్హతలకు 40% మార్కులు సరిపోతుండగా, DCSకి 45% నిబంధన అనవసరమని వారు వాదించారు. ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించేందుకు అర్హత మార్కులను సడలించింది. ఈ చర్య విద్యార్థి సంక్షేమం, విద్యా నాణ్యతకు దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
DSC పోస్టుల వివరాలు..
16,347 DSC పోస్టులు వివిధ ఉపాధ్యాయ హోదాలైన స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) వంటి వాటిని కలిగి ఉన్నాయి. ఈ నియామకాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొరతను తీర్చడంతోపాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది, అభ్యర్థులు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం, SC, ST, BC, దివ్యాంగ అభ్యర్థులకు నిర్దిష్ట కోటా కేటాయించారు.
విద్యా రంగంలో సానుకూల మార్పులు..
ఈ అర్హత సడలింపు నిర్ణయం రాష్ట్రంలో విద్యా రంగంలో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచడమే కాక, ఉపాధ్యాయ వత్తిలో వైవిధ్యాన్ని తీసుకొస్తుందని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో కఠినమైన అర్హత నిబంధనల కారణంగా అవకాశాలు కోల్పోయిన అనేక మంది అభ్యర్థులు ఇప్పుడు ఈ ఇ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం పొందుతారు. అయితే, ఈ సడలింపు విద్యా నాణ్యతపై ప్రభావం చూపకుండా ఉండేందుకు శిక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని కొందరు సూచిస్తున్నారు.
ప్రభుత్వ విధానాల్లో పురోగతి
ఈ నిర్ణయం సామాజిక న్యాయం, సమాన అవకాశాల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. రాష్ట్రంలో SC, ST, BC, దివ్యాంగ సముదాయాల నుంచి వచ్చే అభ్యర్థులు విద్యా రంగంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఈ సడలింపు దోహదపడుతుంది. సోషల్ మీడియాలో అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు ఈ చర్యను స్వాగతిస్తూ, ప్రభుత్వ సానుకూల వైఖరిని అభినందిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ నిర్ణయం వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడంలో కీలకమైన అడుగుగా అభివర్ణించారు.