Homeఆంధ్రప్రదేశ్‌Jagan Rally Accident Sattenapalli: జగన్ పర్యటనలో అపశృతి.. రోడ్డుపై నడుచుకు వెళుతుండగా!

Jagan Rally Accident Sattenapalli: జగన్ పర్యటనలో అపశృతి.. రోడ్డుపై నడుచుకు వెళుతుండగా!

Jagan Rally Accident Sattenapalli: నాటకీయ పరిణామాల నడుమ ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy). శాంతి భద్రతల దృష్ట్యా ఆయన పర్యటనపై ఆంక్షలు విధించారు పోలీసులు. అయినా సరే భారీ కాన్వాయ్ తో ఆయన పర్యటన ముందుకు సాగడంతో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీలో వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక మనిషి ప్రాణాలను కూడా పట్టించుకోరా అంటూ సోషల్ మీడియా వేదికగా ఎక్కువమంది ప్రశ్నిస్తున్నారు. సత్తెనపల్లిలో ఆత్మహత్య చేసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శించడానికి జగన్ వెళ్లారు. ఏడాది కిందట మృతి చెందిన ఆయన కుటుంబానికి ఇప్పుడా పరామర్శించడం అంటూ టిడిపి ప్రశ్నిస్తోంది. నాగమల్లేశ్వరరావు మృతి చెందడానికి జగన్ కారణమని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందడంతో ఇది రాజకీయ అంశంగా మారింది.

Also Read: Jagan Telangana Tapping Plot: తెలంగాణ నుంచి జగన్ కు ప్రమాదం!

ఆంక్షలు విధించిన పోలీసులు
ఇటీవల జగన్ పర్యటనల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. అందుకే పోలీస్ శాఖ( police department) ఆంక్షలు విధించింది. పరిమిత కాన్వాయ్ తో మాత్రమే రావాలని సూచించింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీనిని లెక్క చేయలేదు. భారీ కాన్వాయ్ తోనే జగన్ తన పర్యటనను చేపట్టారు. అయితే గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో లాల్ పురం హైవేలో జగన్ కాన్వాయ్ లో ఓ వాహనం ఢీకొని వృద్ధుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు గుర్తించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. అయితే ఆ వృద్ధుడు ఎవరనేది వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Ambati Rambabu Sattenapalli Clash: అనుమతి లేకపోయినా.. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఘాటు ప్రదర్శన!

పట్టించుకోని వైసీపీ నేతలు..
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని వాహనం ఢీకొట్టడంతోనే ఆయన తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరిగినా.. జగన్మోహన్ రెడ్డి కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ.. కనీసం స్పందించకపోవడం విమర్శలకు గురిచేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆత్మహత్య చేసుకోగా ఆయన కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. తన కాన్వాయ్ మూలంగా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోతే పట్టించుకోరా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తీరును తప్పుపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular