Homeఆంధ్రప్రదేశ్‌Jagan Padayatra 2.0: వైఎస్.జగన్ బిగ్ స్టెప్.. ఇది గేమ్ చేంజర్ అవుతుందా?

Jagan Padayatra 2.0: వైఎస్.జగన్ బిగ్ స్టెప్.. ఇది గేమ్ చేంజర్ అవుతుందా?

Jagan Padayatra 2.0: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయింది. టీడీపీ-జనసేన-బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చంద్రబాబునాయుడు సీఎం అయ్యారు. జనసే అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయ్యారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో కూటమి సర్కార్‌ ఏడాది పాలన తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోసారి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం(జూలై 1న) నిర్వహించిన యువనేతల సమావేశంలో తన నిర్ణయం ప్రకటించారు.

Also Read: Jagan Kotamreddy Fallout: జగన్ కంట్లో నలుసుగా ఒకప్పటి వీర విధేయుడు!

అదే రాజకీయ ఆయుధం..
జగన్‌ 2017-19 మధ్య చేసిన ‘ప్రజా సంకల్పయాత్ర’ ఆయనకు రాజకీయంగా గణనీయమైన విజయాన్ని అందించింది. ప్రజల మధ్య ఉండడం, వారి సమస్యలను ఆలకించడం ద్వారా ఆయన వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. రాబోయే ఎన్నికల ముందు కూడా అదే ఆయుధం ఎక్కుపెట్టాలని జగన్‌ భావిస్తున్నారు. ఇది జగన్ ‘మాస్ కనెక్ట్’ వ్యూహాన్ని సూచిస్తుంది. ఈ పాదయాత్ర ద్వారా, ప్రజలతో భావోద్వేగ సంబంధాన్ని బలోపేతం చేయడంతోపాటు, ప్రతిపక్ష హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

సోషల్ మీడియా శక్తి గుర్తింపు..
జగన్ తన ప్రకటనలో సోషల్ మీడియా శక్తిని గుర్తించారు, దాన్ని ‘ఫోన్ ఆయుధం’గా పేర్కొన్నారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా రాజకీయ ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయాలని, అన్యాయాలను తక్షణం సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని జగన్ సూచించడం, ఆధునిక రాజకీయ వ్యూహంలో డిజిటల్ వేదికల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ వ్యూహం ద్వారా యువ ఓటర్లను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఆకర్షించి, పార్టీ సందేశాన్ని వేగంగా, విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని జగన్ భావిస్తున్నారు.

Also Read: Jagan Nellore Tour: బలప్రదర్శనలకు నమ్ముకున్న జగన్!

యువ నేతలపై ఫోకస్‌..
జగన్ యువ నేతలతో సమావేశంలో ఈ ప్రకటన చేయడం కేవలం పాదయాత్ర గురించి మాత్రమే కాదు, పార్టీ భవిష్యత్ నాయకత్వాన్ని సిద్ధం చేయడంలో కూడా భాగమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యువ నేతలను ఉత్సాహపరచడం, వారిని సోషల్ మీడియా యాక్టివిస్టులుగా మార్చడం ద్వారా, జగన్ రాజకీయంగా చురుకైన, డిజిటల్ యుగానికి అనుగుణమైన నాయకత్వాన్ని తయారు చేస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా యువతలో వైసీపీ ఆకర్షణను పెంచడంతోపాటు, ఎన్నికల్లో కీలక ఓటరు వర్గాన్ని లక్ష్యం వ్యూహంగా పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version