Prabhas-Lokesh Kanagaraj: రెబల్ ప్రభాస్(Rebel Star Prabhas) లైనప్ ప్రస్తుతం ఎలా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి ఆయన ‘రాజా సాబ్'(Rajasaab Movie) షూటింగ్ లో కొన్ని రోజులు, హను రాఘవపూడి(Hanu Raghavapudi) సినిమాలో మరికొన్ని రోజులు గడుపుతూ వస్తున్నాడు. ఇందులో రాజాసాబ్ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. హను రాఘవపూడి చిత్రం షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా ఏడాది సమయం పట్టేలా ఉంది. రీసెంట్ గానే రాజా సాబ్ టీజర్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు చిత్రాలు పూర్తి అయ్యాక ఆయన సందీప్ వంగ(Sandeep Vanga) ‘స్పిరిట్'(Spirit Movie) చిత్రానికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ప్రభాస్ మరో సినిమా చేయడానికి వీలు లేదనే కండీషన్ ఉంది. అందుకే ఈ చిత్రం ఇంకా మొదలు అవ్వలేదు.
Also Read: Raja Saab Item Song: రాజా సాబ్’ మూవీ లో స్టార్ హీరో భార్య ఐటెం సాంగ్!
ఈ సినిమా తో పాటు ‘కల్కి 2’, ‘సలార్ 2’ చిత్రాలు చేయాల్సి ఉంది. స్క్రిప్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఈ రెండు కాకుండా ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తో ఒక సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరిగింది. ఇది కాకుండా హోమబుల్ సంస్థ తో మూడు సినిమాలు చేయడానికి ప్రభాస్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అందులో ‘సలార్ 2’ ఒకటి. మిగిలిన రెండు సినిమాల్లో ఒకటి లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) తో ఉంటుందని నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా లో జరిగిన ప్రచారం. లోకేష్ కూడా పలు ఇంటర్వ్యూస్ లో ప్రభాస్ తో భవిష్యత్తులో సినిమా చేసే ప్లాన్ ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో కచ్చితంగా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళ కాంబినేషన్ లో సినిమా క్యాన్సిల్ అయ్యిందట.
Also Read: Jagan Padayatra 2.0: వైఎస్.జగన్ బిగ్ స్టెప్.. ఇది గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రభాస్ తో చేయాల్సిన సినిమా ఇప్పుడు లోకేష్ అమీర్ ఖాన్ తో చేయడానికి సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ కథని లోకేష్ తమిళ హీరో సూర్య కోసం రాసుకున్నాడు. ఎందుకో ఆ ప్రాజెక్ట్ కుదర్లేదు. మళ్ళీ ఇదే స్టోరీ కి కొత్త రంగులు అద్ది ప్రభాస్ తో చెయ్యాలని అనుకున్నాడు. కానీ చివరికి ఈ కథ అమీర్ ఖాన్ వద్దకు చేరిందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న చర్చ. ‘కూలీ’ చిత్రాన్ని పూర్తి చేసిన లోకేష్, తన తదుపరి చిత్రాన్ని కార్తీ తో ‘ఖైదీ 2’ చేయబోతున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం తర్వాత అమీర్ ఖాన్ తో ఒక సినిమా, ఆ తర్వాత రోలెక్స్, విక్రమ్ 2 , లియో 2 చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి అయ్యి ప్రభాస్ వద్దకు వచ్చేలోపు నాలుగేళ్లు దాటేస్తుంది. అప్పటికి ఎవరి మూడ్ ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి , ప్రభాస్ తో సినిమా ఇప్పట్లోనే కాదు , భవిష్యత్తులో కూడా సాధ్యం కాదని అంటున్నారు.