Ind Vs Eng 2nd Test Yashasvi Jaiswal: టీమిండియాలో అద్భుతమైన ఫీల్డర్లు ఉంటారు. మ్యాచ్ చేజారిపోతున్న సందర్భంలో భారత ఫీల్డర్లు నైపుణ్యంతో గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఆధునిక కాలంలో ఫీల్డింగ్ కు ప్రాధాన్యం విపరీతంగా పెరిగింది. ఇక నేటి కాలంలో ఆటగాళ్లు అందరూ అద్భుతంగా ఫీల్డింగ్ చేసేవాళ్లే. వారిలో ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అని చెప్పడానికి లేదు. అయితే ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత ఫీల్డింగ్ ఆకట్టుకునేంత గొప్పగా లేదు. అందువల్లే తొలి టెస్ట్ లో భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. భారత్ ఓడిపోవడానికి బౌలింగ్ కంటే నాసిరకమైన ఫీల్డింగే ప్రధాన కారణం. అందులోనూ భారత జట్టు తరుపున యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అత్యంత దారుణంగా ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్ పరంగా ఇతడికి వంక పెట్టే అవకాశం లేకపోయినప్పటికీ.. ఫీల్డింగ్ విషయంలో మాత్రం బి గ్రేడ్ స్థాయిని ప్రదర్శించాడు.
తొలి టెస్ట్ లో జైస్వాల్ ఏకంగా నాలుగు క్యాచ్ లు నేలపాలు చేశాడు. అతడు క్యాచ్ లు వదిలివేయడం వల్ల ఇంగ్లాండ్ ఆటగాళ్లు బతికిపోయారు. వచ్చిన జీవధానాలను సద్వినియోగం చేసుకున్నారు. భారీగా పరుగులు చేసి అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సాధ్యం చేసుకున్నారు. తద్వారా వారి సొంత దేశంలో మన జట్టును అత్యంత అవమానకరమైన స్థితిలో ఓడించారు. టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం జైస్వాల్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తొలి టెస్ట్ ఓడిపోయిన తర్వాత జైస్వాల్ మీద విపరీతంగా విమర్శలు వచ్చాయి. కొందరు సీనియర్ ఆటగాళ్లయితే అతడిని రెండో టెస్టుకు దూరంగా ఉంచాలని సూచించారు కూడా.
రెండవ టెస్ట్ బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో యశస్వి విషయంలో టీమ్ ఇండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్లిప్ లో జైస్వాల్ తో ఫీలింగ్ చేయించకూడదని నిర్ణయించింది. ఇదే విషయాన్ని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే వెల్లడించాడు. అతని మీద ఉన్న విపరీతమైన ఒత్తిడిని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాడు. జైస్వాల్ పూర్తి సన్నద్ధతతో ఉన్నప్పుడు మాత్రమే స్లిప్స్ లో ఫీల్డింగ్ చేయిస్తామని అతడు వెల్లడించాడు. ” అతడు యువ ఆటగాడు. బ్యాటింగ్ దూకుడుగా చేస్తాడు. ఫీల్డింగ్ విషయంలోనూ వంక పెట్టే అవకాశం లేదు. కాకపోతే అతడు క్యాచ్ లు వదిలి వేయడం వల్ల అది జట్టు విజయాకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అతడు పూర్తిగా సన్నద్ధతతో ఉన్నప్పుడు మాత్రమే స్లిప్స్లో ఫీలింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తామని” డస్కాటే వెల్లడించాడు.
తొలి టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ సూపర్ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.. టీమ్ ఇండియా చేసిన భారీ స్కోరులో తన వంతు పాత్ర పోషించాడు. కానీ రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం అతడు దారుణంగా తేలిపోయాడు. సింగిల్ డిజిట్ స్కోర్ కే వెనుతిరిగాడు. అంతేకాకుండా కీలకమైన క్యాచ్ లు నేలపాలు చేసి టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాడు.