Homeఆంధ్రప్రదేశ్‌Jagan Nellore Tour: బలప్రదర్శనలకు నమ్ముకున్న జగన్!

Jagan Nellore Tour: బలప్రదర్శనలకు నమ్ముకున్న జగన్!

Jagan Nellore Tour: వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) మరోసారి బలప్రదర్శనకు దిగుతారా? ఈసారి నెల్లూరు ను ఎంచుకున్నారా? మరోసారి దారి పొడవునా జన జాతర తప్పదా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించకుండా, ప్రజల మధ్యకు వెళ్లకుండా ఈ బల ప్రదర్శన చేయడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం దీనిపై రకరకాలుగా వ్యాఖ్యలు ఇస్తున్నాయి. పల్నాడు పర్యటన ఒక విధంగా వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చినట్లు అయింది. ఆత్మహత్య చేసుకున్న వైసిపి నేత విగ్రహ ఆవిష్కరణకు వెళ్లారు జగన్. కానీ బలప్రదర్శన మూలంగా ఓ ముగ్గురు చనిపోయారు అన్న అపవాదును మూటగట్టుకున్నారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్త సింగయ్య జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కిందపడి చనిపోయారు అన్న వార్త సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు హైలెట్ అయింది. అందుకే పల్నాడు పర్యటనతో పార్టీకి లాభం కంటే నష్టం అధికమని ఎక్కువమంది వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

Also Read: యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్.. పూర్ణచందర్ భార్య బయటపెట్టిన సంచలన నిజాలు

* జనాదరణ ఆ పార్టీ సొంతం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి విశేష ప్రజాదరణ ఉంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా జనాదరణ మాత్రం తగ్గలేదు. జనాదరణ ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కింది ఒక్కసారి మాత్రమే. 2014లో 67 అసెంబ్లీ స్థానాలతో గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా దక్కింది. కానీ 2024 లో మాత్రం కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. 2019 ఎన్నికల నాటికి వన్ చాన్స్ అన్న నినాదంతో తన సంప్రదాయ ఓటు బ్యాంకు తో పాటు ఇతర వర్గాలు సైతం జగన్ వైపు మొగ్గు చూపారు. కానీ 2029 ఎన్నికల నాటికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు జగన్ పాలనను ప్రజలు చూశారు. ఆయన పాలన పట్ల సానుకూలత చూపిన వారి కంటే.. వ్యతిరేకించిన వారే అధికం. అయితే పాత చింతకాయ మాదిరిగా బల ప్రదర్శన దిగి.. బలం చూపించాలనుకుంటే మాత్రం తనను అభిమానించే సంప్రదాయ ఓటర్లు ఆనందిస్తారు. కానీ తటస్థులు మాత్రం హర్షించరు. ఈ విషయాన్ని జగన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది.

* ఎప్పుడో జిల్లాల పర్యటన ప్రకటన..
వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు( districts Tours ) వస్తానని గత ఏడాది డిసెంబర్లో ప్రకటించారు. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తానని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారానికి నాలుగు రోజులపాటు ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆరు నెలలు గడుస్తున్న ఇంతవరకు జిల్లాల పర్యటనకు సంబంధించి అతి గతి లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రాజకీయ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ఎంతవరకు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయరు అని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రజల మధ్యకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సాహసం చేయడం లేదు.

* ప్రజా సమస్యలపై అంతంతే..
గత ఏడాది కూటమి( Alliance ) పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై స్పందించింది ఒకే ఒక్కసారి. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి అక్కడ రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మద్దతు ధర గురించి డిమాండ్ చేశారు. దానికి మించి ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన దాఖలాలు లేవు. తాను పిలుపు ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో సైతం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు. ఎంతవరకు కేసుల్లో ఇరుక్కున్న నేతల పరామర్శలకు జైలుకు వెళ్లడం, ఎవరైనా నేతలు చనిపోతే పరామర్శలకు వెళ్లడం వంటి వాటితో సరిపెట్టారు. ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు కూడా తాడేపల్లి నుంచి భారీ వాహనాలతో నెల్లూరు బయలుదేరుతారని తెలుస్తోంది. అంటే దారి పొడవు ఉన్న జన జాతరను తలపించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం బలప్రదర్శన ఒక్కటే రాజకీయం కాదు. అది ఎంత మాత్రం శ్రేయస్కరం కూడా కాదు. అది తప్పకుండా వాపును చూసి బలుపు అని భ్రమించినట్టు ఉంటుంది. ఈ బలప్రదర్శనతో కొన్ని వర్గాలకు దూరమవుతారన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గ్రహించుకోవాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version