Homeఆంధ్రప్రదేశ్‌Jagan on AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. చిన్నచిన్న లాజిక్ మిస్సైన జగన్

Jagan on AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. చిన్నచిన్న లాజిక్ మిస్సైన జగన్

Jagan on AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ ను(Andhra Pradesh) మద్యం కుంభకోణంకుదిపేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో భారీ కుంభకోణం జరిగినట్టు కూటమి ప్రభుత్వం అనుమానించింది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఫుల్ ఫోకస్ పెట్టింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కీలక ఆధారాలను సేకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో తెరవెనుక ఏం జరిగింది? ఎలా దోపిడీకి పాల్పడ్డారు. డిస్టలరీలను బెదిరించి ఎలా కమీషన్లు దండుకున్నారు? వంటి వాటిపై పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన తరువాత ప్రత్యేక దర్యాప్తు  (సిట్) విచారణ ప్రారంభమైంది. అప్పటి బేవరజేస్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. అటు తరువాత వరుస అరెస్టులు ప్రారంభమయ్యాయి. రాజ్ కసిరెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు పైలా, తరువాత అప్పటి సీఎంవో అధికారి, ఐఏఎస్ ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్టయ్యారు. ఇక తరువాయి జగన్మోహన్ రెడ్డి అని అంతా ప్రచారం జరుగుతోంది.

పెను ప్రకంపనలు..
గత కొద్దిరోజులుగా లిక్కర్ స్కాం (Liquor Scam)ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సడెన్ గా మీడియా ముందుకు వచ్చారు. సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ మీడియా సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. అధికారం కోల్పోయిన తరువాత ప్రత్యేకంగా నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఉన్నఫలంగా మీడియా ముందుకు రావడం, సుదీర్ఘంగా మద్యం కుంభకోణంపై మాట్లాడం చూస్తుంటే మాత్రం అరెస్టు భయం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా తాను విజయవాడలో ఉంటానని.. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ సవాల్ చేయడం కూడా సంచలనంగా మారుతోంది. తనను తప్పకుండా అరెస్టు చేస్తారన్న పక్కా భయంతోనే జగన్ ఈ ప్రకటన చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి.

Also Read: Jagan Action Pawan Reaction: జగన్ యాక్షన్.. పవన్ రియాక్షన్.. వీడియో వైరల్!

అలా చెప్పి అడ్డంగా బుక్కయ్యారు..
అయితే మద్యం అమ్మకాలు విషయంలో జగన్ (Jaganmohan Reddy) సిన వ్యాఖ్యలు వింతగా ఉన్నాయి. మరింత విస్తుగొలుపుతున్నాయి. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గాయని.. అటువంటప్పుడు కుంభకోణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. లాజిక్ లను తెరపైకి తెచ్చారు. టీడీపీ హయాంలో..2018,2019లో 17,347 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని గుర్తు చేశారు. అప్పట్లో భారీగా అమ్మకాలు జరిగాయంటే డిస్టలరీల నుంచి భారీగా వసూలు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో తమ పాలనలో చివరి ఏడాది అయిన 2023,2024లో ఏకంగా రూ.25,083 కోట్ల అమ్మకాలు జరిగాయని చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. అమ్మకాలు పెరిగితే కదా అవినీతికి తావుందని జగన్ చెప్పి..మరీ తన చివరి ఏడాది పాలనలో పెరిగిన అమ్మకాలను బయటకు చెప్పేశారు.

Also Read: Chandrababu to Meet Union Ministers : వరుసగా ఏడుగురు కేంద్ర మంత్రులతో.. చంద్రబాబు ఎందుకలా!

అమ్మకాలు తగ్గాయి.. కానీ ఆదాయం పెరిగిందిగా..
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మద్యం అమ్మకాలు తగ్గి ఉండొచ్చుగాక.. కానీ రూ.100లకు లభించే బాటిల్ ను రూ.250 వరకూ విక్రయించారు. అంటే అప్పటివరకూ ఉన్న ధరకు 100 నుంచి 150 శాతం వరకూ పెంచి విక్రయించారు. దీంతో అమ్మకాలు తగ్గాయి కానీ.. ఆదాయం పెరిగింది. అయితే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి లాజిక్ మిస్సయ్యారు. భారీగా టాక్స్ లు పెంచడం వల్లే ఆదాయం పెరిగిందంటున్నారు. పెరిగిన టాక్స్ లు డిస్టలరీలపై కాదు. టాక్స్ వేసింది మధ్యతరగతి వారిపైనే. డిస్టలరీలు నిర్ణీత ధరకే ఇస్తాయి. వాటి ధరను పెంచి ప్రభుత్వాలు విక్రయిస్తాయి. అందులో టాక్స్ లు సైతం కలిసి ఉంటాయి. కానీ మద్యం తాగే జనాలపై టాక్స్ లు పెంచారు. ధర పెంచి అమ్మారు. లాభాపేక్ష లేకుంటే మద్యం ద్వారా ప్రభుత్వానికి ఎలా ఆదాయం వచ్చింది. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటివరకూ ఉన్న ప్రీమియం బ్రాండ్లు కనిపించకుండా పోయాయి. నాసి రకం మద్యం ..అది కూడా ఒక్కో బాటిల్ పై రూ.100 నుంచి రూ.150 వరకూ అదనంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అస్సలు కుంభకోణం అన్నది జరగలేదని నమ్మించే ప్రయత్నం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular