Jagan Mavigan: ప్రస్తుతం ఏపీలో అమరావతి( Amaravathi capital ) పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన చేశారు. అయితే ఏ సోషల్ మీడియాలో చూసినా ఇప్పుడు మావిగాన్ పై చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పై ఎక్కువ మంది విరుచుకుపడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. అమరావతిని అంగీకరించింది ఆయనే. దానిని కాదని మూడు రాజధానులు తెచ్చింది ఆయనే. దానిని పూర్తి చేయలేక పోయింది ఆయనే. ఇప్పుడేమో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో మావిగన్ అంటూ కీలక ప్రతిపాదన చేశారు. జనాలు దీనిపై చర్చించుకుంటున్నారు. అయితే దానిని గొప్పగా చెబుతోంది సాక్షి మీడియా. అద్భుతమైన ఆలోచన అని జనం మెచ్చుకుంటున్నారు అంటూ సాక్షిలో పెద్ద డిబేట్ పెడుతున్నారు.. అయితే సాక్షిలో ఏ స్థాయిలో అతి ఉంటుందో తెలియంది కాదు. ” సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారానికి విశాఖ అయితే సరిపోతుంది” అంటూ సాక్షి మీడియా జర్నలిస్టు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. ఇప్పుడు అదే సాక్షి మావిగన్ ను పెద్ద ఫీడ్ బ్యాక్ ఇస్తుండడం గమనార్హం.
Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..
* విపరీతంగా ట్రోల్స్ మచిలీపట్నంలో( Machilipatnam) మా తీసుకోండి.. విజయవాడలో వి తీసుకోండి.. గుంటూరులో గన్ తీసుకోండి.. మూడు కలిపితే మావిగాన్ అంటూ బదులిచ్చారు జగన్. కానీ సోషల్ మీడియాలో ఆయనను వీర విహారం చేస్తున్నారు. ఆ పేరు పై జరుగుతున్న ట్రోలింగ్, మీమ్స్ చూస్తే మతిపోతుంది. జగన్ ఒకే ఒక్క మాటతో సోషల్ మీడియాను షేక్ చేశారు. అయితే ఎక్కువ మంది మాత్రం కామెడీ కోణంలోనే చూస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన అనేది ప్లాఫ్ అయ్యింది. జగన్ తన పాత అలవాటు ప్రకారం ఒక వింతైన రాజధాని ప్రతిపాదనను తెచ్చారు. అయితే ఈసారి విశేషం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో కామెడీ, ఇతర ట్రోల్స్ చూసి సాక్షికి గొప్పగా కనిపిస్తోంది. గొప్పగా ప్రచారం చేస్తోంది.
* సోషల్ మీడియాలో ఒక ఆట..
సాధారణంగా ఏదైనా పరిణామం చోటు చేసుకుంటే సోషల్ మీడియాలో( social media) ప్రచారం జరగడం రివాజు. ఒకటి రెండు రోజులు ఆ హడావిడి నడుస్తుంది. తరువాత క్రమేపి తగ్గిపోతుంది. కానీ జగన్ మావిగన్ మాత్రం తగ్గడం లేదు. నెటిజెన్లు రకరకాల పేర్లు పెట్టి ఒక ఆట ఆడేసుకుంటున్నారు. రకరకాల నగరాలు పట్టణాలు కలుపుతూ.. ద్వంద అర్ధాలు వచ్చేలా వెటకారాలు ఆడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ షార్ట్స్ లో జగన్ వాయిస్ కు రకరకాల కామెడీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి తెగ వైరల్ చేస్తున్నారు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి పరువు పోతోందని వైయస్సార్ పార్టీ శ్రేణులు పడుతున్న బాధ అంతా ఇంత కాదు.
* భలే సమర్ధింపు..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి మావిగన్( mavgan) వ్యాఖ్యలను సమర్ధించుకోలేక వైసీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. అంబటి రాంబాబు తో పాటు పేర్ని నాని మాత్రం సమర్ధించుకుంటున్నారు. ఇప్పుడు నవ్వుతున్న వారంతా రేపు మావిగన్ గొప్పతనం చూసి ఆశ్చర్యపోతారు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే సోషల్ మీడియా వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతలా ఎప్పుడు ఇబ్బంది పడలేదు. గతంలో రాజకీయ ప్రత్యర్థులపై వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడేది. కానీ జగనే ఇప్పుడు మిగతా సోషల్ మీడియాకు కావాల్సినంత వనరు ఇస్తున్నారు. పార్లమెంటులో చట్టబద్ధతతో అమరావతిని ఇక కదిలించలేరు అనే పరిస్థితి వచ్చింది. కానీ జగన్ మాత్రం విడ్డూరమైన పేర్లతో గందరగోళం సృష్టించడం అతి పెద్ద తప్పు అని.. ఆయన కామెడీ పీస్ అయ్యారు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
