Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh comments on Prakash Raj: 'అసలు నువ్వు ఎవడివిరా' అంటూ ప్రకాష్ రాజ్...

Bandla Ganesh comments on Prakash Raj: ‘అసలు నువ్వు ఎవడివిరా’ అంటూ ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడిన నిర్మాత బండ్ల గణేష్..

Bandla Ganesh comments on Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సెక్యులర్ ముసుగులో హిందువులను , హిందువుల దేవుళ్లను ఎల్లప్పుడూ అవహేళన చేసే సంగతి అందరికీ తెలిసిందే. హిందువుల తరుపున ఎవరైనా ఏదైనా మాట్లాడితే , వాళ్లపై నోరేసుకొని పడిపోవడం ఇతనికి చాలా సరదా. అలా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఈయన ఎల్లప్పుడూ నోరు జారుతూనే ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈయనకు ఇప్పటికీ గౌరవం ఇస్తూనే […]

Bandla Ganesh comments on Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సెక్యులర్ ముసుగులో హిందువులను , హిందువుల దేవుళ్లను ఎల్లప్పుడూ అవహేళన చేసే సంగతి అందరికీ తెలిసిందే. హిందువుల తరుపున ఎవరైనా ఏదైనా మాట్లాడితే , వాళ్లపై నోరేసుకొని పడిపోవడం ఇతనికి చాలా సరదా. అలా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఈయన ఎల్లప్పుడూ నోరు జారుతూనే ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈయనకు ఇప్పటికీ గౌరవం ఇస్తూనే ఉంటాడు. కానీ ప్రకాష్ రాజ్ ఆ గౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. అకారణంగా , సమయం , సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విరుచుకుపడడమే ఇతనికి తెలిసిన విషయం అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ సైతం అంటుంటారు. అయితే తాజాగా , తెలంగాణ లో జరిగిన రాజకీయ పరిణామాలపై , జనసేన చుట్టూ తిరుగుతున్న రాజకీయాలపై ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘ మీరొస్తానంటే మేమొద్దంటామా?, రండి దొర , కానీ వచ్చే ముందు ఒక క్లారిటీ ఇవ్వండి. ఒంటరిగా వస్తున్నారా?, లేదా పొత్తుతో వస్తున్నారా?, అది జనాలకు చెప్పి రండి’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్. దీనిపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘నీకెందుకురా ప్రతీ దాంట్లో వేలుపెడుతావు?, అసలు నువ్వెవడివి?, నీ ఊరు ఏది?, నీ కథ ఏంటి?, ప్రతీ ఊర్లో , ప్రతీ సమస్యలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్ వా?, లేదా ఈ దేశానికీ ప్రధానివా?, ఎక్కడ చూసిన నువ్వే , ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బ్రతుక్కి ఏ పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలాగా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో , తర్వాత ఈ ప్రపంచాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేద్దువు గానీ ‘ అంటూ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్, నీకు నువ్వే గొప్ప మేధావిని అనుకుంటున్నావు , కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్. నీ సొంత రాష్ట్రము లో కనీస ప్రజల మద్దతుని కూడా సంపాదించలేని నువ్వు, రాష్ట్ర స్థాయి నాయకులను , దేశ స్థాయి నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదం’ అంటూ మండిపడ్డాడు. బండ్ల గణేష్ స్పందించిన ఈ తీరుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చప్పట్లు కొడుతున్నారు. వింటేజ్ బండ్లన్న ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. గతం లో బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన గోవిందుడు అందరివాడేలే , టెంపర్ చిత్రాల్లో ప్రకాష్ రాజ్ నటించాడు. ఈ చిత్రాల్లోనూ ఆయనకు బలమైన క్యారెక్టర్స్ పడ్డాయి. బండ్ల గణేష్ కి ప్రకాష్ రాజ్ తో ఆ రెండు సినిమాల ద్వారా మంచి అనుబంధం ఏర్పడింది , అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఈ స్థాయిలో మాట్లాడడం అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper