Homeఎంటర్టైన్మెంట్Ram Charan and Allu Arjun multistarrer: రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబోలో సినిమాను...

Ram Charan and Allu Arjun multistarrer: రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబోలో సినిమాను సెట్ చేస్తున్న స్టార్ డైరెక్టర్… వర్కౌట్ అవుతుందా..?

Ram Charan and Allu Arjun multistarrer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు మంచి గిరాకీ పెరిగింది. పాన్ ఇండియాలో కూడా మల్టీ స్టారర్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో అప్పటినుంచి స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక చాలా మంది దర్శకులు కూడా […]

Ram Charan and Allu Arjun multistarrer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు మంచి గిరాకీ పెరిగింది. పాన్ ఇండియాలో కూడా మల్టీ స్టారర్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో అప్పటినుంచి స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక చాలా మంది దర్శకులు కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి కథలు రెడీ చేసుకుంటున్నారు. కొంతమంది డైరెక్టర్స్ ఇప్పటికే మల్టీ స్టారర్ కథలను రెడీ చేసినప్పటికీ ఆ కథల విషయంలో హీరోలు పెద్దగా సంతృప్తి చెందకుపోవడంతో వాటిని చేయలేకపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లను కలుపుతూ ఒక స్టార్ డైరెక్టర్ ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే సందీప్ రెడ్డి వంగ కావడం విశేషం… ప్రస్తుతం ఆయన స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన రామ్ చరణ్ – అల్లు అర్జున్ లను కలిపి ఒక సినిమా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.

ఇక ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనడం లో క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరిని కలపాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం అంటూ చాలామంది కొనియాడుతున్నారు. నిజానికి ఎవడు సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటించారు. కానీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఆ మూవీలో అల్లు అర్జున్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ ఎపిసోడ్ వస్తుంది. కాబట్టి ఇద్దరు కలిసి ఒకసారి స్క్రీన్ మీద అయితే కనిపించలేదు. ఇంకా దానికి తోడుగా వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు కొంచెం విభేదాలు కూడా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

వాటన్నింటిని దాటుకొని సందీప్ రెడ్డి వంగ వీళ్లిద్దరితో సినిమాలు చేసి సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఒకవేళ ఇది కనక వర్కౌట్ అయితే మాత్రం అటు రామ్ చరణ్ అభిమానులు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేసే అవకాశాలైతే ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper