https://oktelugu.com/

YS Bharathi: జగన్ కోసం నెత్తిన ఎత్తుకున్న భారతి

రాష్ట్రవ్యాప్తంగా జగన్ పర్యటనలు చేయాల్సి ఉండడంతో.. పులివెందుల బాధ్యతను సతీమణి వైయస్ భారతికి అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Written By: , Updated On : April 25, 2024 / 03:05 PM IST
YS Bharathi

YS Bharathi

Follow us on

YS Bharathi: వైసీపీకి ఇప్పుడు జగన్ ఒక్కరే స్టార్ క్యాంపెయినర్. గత ఎన్నికల మాదిరిగా సినీ నటులు లేరు. కుటుంబ సభ్యులు అంతకంటే కనిపించడం లేదు. అందుకే జగన్ ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఒక్కరే ప్రచార బాధ్యతలను చూస్తున్నారు. జగన్ కు అంతకుమించి అవకాశం కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ ఎన్నికలు గతం కంటే భిన్నం. గత ఎన్నికలకు ముందు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్. కానీ ఈసారి అటువంటి యాత్రలకు అవకాశం లేదు. పోనీ తన తరుపున చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ కూడా ఇప్పుడు లేరు. అందుకే ఈసారి జగన్ బలమైన నిర్ణయానికి వచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా జగన్ పర్యటనలు చేయాల్సి ఉండడంతో.. పులివెందుల బాధ్యతను సతీమణి వైయస్ భారతికి అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు పులివెందులలో జగన్ ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి హాజరైన భారతి వారం రోజుల పాటు పులివెందులలో ఉండి ప్రచారం చేయనున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ షర్మిల తో పాటు సునీత ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో పులివెందుల ప్రచార బాధ్యతలు తీసుకుంటున్న భారతి ఎలా రిప్లై ఇస్తారో చూడాలి. అయితే ఆమె పార్టీ శ్రేణులతో సమన్వయానికే పరిమితం అవుతారన్న టాక్ కూడా ఉంది.

గత ఎన్నికల్లో భారతి ప్రచారం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తగా కూడా రాణిస్తున్నారు. సొంత మీడియా బాధ్యతలను ఆమె చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆమె తాడేపల్లి లోనే ఉంటూ జగన్ బాగోగులు చూసుకుంటున్నారు. జగన్కు మద్దతుగా గత ఎన్నికల్లో పులివెందులలో భారతీ ఇంటింటా ప్రచారం చేశారు. అప్పట్లో ప్రజలను ఆకట్టుకోవడంలో భారతి సక్సెస్ అయ్యారు. అందుకే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా భారతితో పర్యటనలు చేయించాలని జగన్ భావించారు. కానీ ఇప్పుడు కడపలో సొంత కుటుంబ సభ్యులే తనకు వ్యతిరేకంగా మారడంతో.. భారతిని అక్కడే ప్రయోగిస్తే మేలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే వారం రోజులపాటు భారతి పులివెందులలో పార్టీ శ్రేణులతో ప్రచారం చేస్తారు. పార్టీని సమన్వయం చేసుకుంటారని పార్టీ వర్గాలు చేస్తున్నాయి. అయితే షర్మిల, సునీతలపై విరుచుకు పడతారా? కేవలం ఇంటింటా ప్రచారానికి పరిమితం అవుతారా? అన్నది చూడాలి.