Rahul Gandhi : ప్రభుత్వ ఆదాయాన్ని పంచటం, వ్యక్తి సంపదని పంచటం ఒకటి కాదు

ప్రభుత్వ ఆదాయాన్ని పంచటం, వ్యక్తి సంపదని పంచటం ఒకటి కాదు.. అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 25, 2024 4:10 pm

Rahul Gandhi : రాహుల్ గాంధీ ఎన్నికల వేళ పప్పులో కాలేయడం ఇదే ఫస్ట్ టైం కాదు.. 2019లో ఇదే చేశాడు. ‘చౌకీదార్ చోర్ హై’ అని ప్రచారం చేశాడు. ఇప్పుడు 2024లో అదానీ, అంబానీ అంటూ మొదలుపెట్టి వాళ్ల సంపద ఎక్సరే తీసి ప్రజలకు పంచుతానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. సంపద పంచడానికి రాహుల్ ఎవరు? ఎందుకు పంచుతాడు? అన్నది ఎవరికీ అర్థం కాని విషయం..

తన చుట్టూ లెఫ్ట్ కమ్యూనస్టులను పెట్టుకొని వారు చెప్పింది మీడియా ముందు, ప్రజల ముందు చెప్పడం తప్ప సొంతంగా ఎదగలేని వ్యక్తి రాహుల్ గాంధీ. అంబానీ, అదానీలను విలన్లుగా చిత్రీకరించడం రాహుల్ చేస్తోన్న పెద్ద తప్పు.

దేశానికి వ్యతిరేకంగా బయట దేశాల్లో రాహుల్ ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం.. ఇలానే ప్రశాంత్ భూషణ్ కూడా లండన్ వెళ్లి ఆక్సఫర్డ్ యూనివర్సిటీలో విష ప్రచారం చేశాడు. ఈ సంపద పంచడం అనేది నియంత లెనిన్ తీసుకొచ్చిన ఒక క్రూరమైన చట్టం. కమ్యూనిస్టు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఆ అనుభవంతో 1949లో చైనా ఇలానే పంచి విఫలమైంది.

ప్రభుత్వ ఆదాయాన్ని పంచటం, వ్యక్తి సంపదని పంచటం ఒకటి కాదు.. అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.