Jagan Mohan Reddy
Jagan: గుంటూరు జిల్లాలో( Guntur district ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. అక్కడ పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలను ఫైర్ బ్రాండ్ పోతిన మహేష్ కు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే గుంటూరు జిల్లాలో మహేష్ నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. పైగా మహేష్ జూనియర్. స్థానికేతరుడు కావడంతో ఆయనకు బాధ్యతలు ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయనకు సహకరించే స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు లేరు. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పోతిన మహేష్. ఆయనను పవన్ కళ్యాణ్ పై ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. కానీ అనుకున్నంత ఆయన విజయవంతం కాలేదు. అయితే ఖాళీగా ఉన్న పోతిన మహేష్ కు కీలక బాధ్యతలు కట్టబెట్టారు జగన్. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. సహజంగానే ఎగిరి గంతేసిన పోతిన మహేష్ కొంచెం అతి చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఫోన్ చేసి.. సమన్వయంతో పని చేద్దామని పిలుపునిచ్చారు. ఒకరిద్దరు నేతలు తప్ప ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తోంది.
Also Read: రాజకీయ సన్యాసం ప్రకటన పక్కన పెట్టేసిన కేశినేని నాని.. చేరేది ఆ పార్టీలోనే!
* దారుణ పరాజయం..
సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress party) డిజాస్టర్ ఫలితాలను చవిచూసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖాతా తెరవలేదు. ఒక్క సీటు కూడా ఆ పార్టీకి రాలేదు. దీంతో చాలామంది నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి వంటి నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ లాంటి నేతలు సైతం పార్టీని వీడారు. గుంటూరు మేయర్ గా ఉన్న కాబట్టి మనోహర్ నాయుడు ఉన్నపలంగా పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అంటి ముట్టనట్టుగా ఉన్నారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి లాంటి సీనియర్లు ఉన్నారు. అయితే ఇటువంటి నేతలకు కాకుండా విజయవాడకు చెందిన పోతిన మహేష్ కు బాధ్యతలు అప్పగించారు. దీంతో మిగతా నేతలు సైతం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
* టిక్కెట్ రాకపోవడంతో..
జనసేనలో చాలా కాలం పని చేశారు పోతిన మహేష్( Pothi na Mahesh ). పవన్ కళ్యాణ్ సైతం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ కేటాయించారు. మంచి ఓట్లు సాధించారు మహేష్. దీంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బిజెపికి కేటాయించారు. పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించగా.. సీనియర్ నేత సుజనా చౌదరి పోటీ చేశారు. అయితే దీనిని సహించుకోలేకపోయినా పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ పై విపరీత వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పవన్ కళ్యాణ్ పై మహేష్ ను ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయంతో కొద్దిరోజుల పాటు పోతిన మహేష్ కనిపించలేదు. అయితే పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జిగా ఆయనను నియమించడంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే ఆయనకు సహకరించే స్థితిలో గుంటూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేరు. దీంతో మహేష్ సైతం నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పై ఇప్పటికే గుంటూరు జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మహేష్ కు బాధ్యతలు అప్పగించడంతో అది మరింత రెట్టింపు అయ్యింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చుతానని పోతిన మహేష్ చెబుతున్నారు. మరి అందులో ఎంత సక్సెస్ అవుతారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Jagan guntur leaders opposing decision