Homeఆంధ్రప్రదేశ్‌Jagan forgot Stalin: స్టాలిన్ ను మరిచిపోయిన జగన్

Jagan forgot Stalin: స్టాలిన్ ను మరిచిపోయిన జగన్

Jagan forgot Stalin: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే స్పష్టత వచ్చింది. తమిళనాడులో టీవీ కె, కేరళలో యుడిఎఫ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బిజెపి ముందు వరుసలో ఉన్నాయి. తమిళనాడులో అనూహ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకె మంచి విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు.. విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే విజయ్ విషయంలో మాత్రం భిన్నంగా స్పందించారు. అదే సమయంలో స్టాలిన్ కు ఎటువంటి సానుభూతి చూపలేదు. మమతా బెనర్జీ విషయంలో మాత్రం స్పందించారు. ఇప్పుడు అదే వైరల్ అవుతోంది. స్టాలిన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

ప్రియమైన సోదరుడు అంటూ..
ప్రియమైన సోదరుడు అంటూ విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రయత్నం లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడాన్ని ప్రస్తావించారు. దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. అదే సమయంలో మమతా బెనర్జీకి సానుభూతి తెలిపారు. ఓటమి ఎదురుకావడానికి ప్రస్తావిస్తూ విచారం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల్లో బిజెపి విజేతగా నిలవడం పై శుభాకాంక్షలు తెలిపారు. అయితే స్టాలిన్ ఓడిపోవడం పై మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. దానికి కారణం లేకపోలేదు. గతంలో ఇదే స్టాలిన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు జగన్. కానీ ఇప్పుడు విజయ్ ను ప్రియమైన సోదరుడుగా అభివర్ణించి.. స్టాలిన్ కోసం కనీస ప్రస్తావన చేయకపోవడం అనేది విమర్శలకు తావిస్తోంది.

డీఎంకేకు రోజా ప్రచారం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాజకీయాలను తలకెక్కించుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి గాను వైసీపీకి చెందిన మాజీ మంత్రి రోజా వెళ్లారు. డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేశారు. అంతకుముందు డిఎంకె, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా సన్నిహితంగా కొనసాగేవి. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ వచ్చారు. స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి వైసీపీ ప్రజాప్రతినిధులు వెళ్లేవారు. అయితే ఉన్నట్టుండి విజయ్ పేరు చెప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ప్రచారానికి తెరలేపింది. ఇప్పుడు అందరికీ శుభాకాంక్షలు, అందరికీ సానుభూతులు తెలిపిన జగన్.. స్టాలిన్ గురించి కనీసం ప్రస్తావించకపోవడం ఇప్పుడు గమనార్హం. దీనిపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular