Jagan Court Case Update: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో భయం ప్రారంభమైందా? పల్నాడు టూర్ వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి చిక్కుల్లో పెట్టనుందా? ఈ వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఎందుకు గట్టిగా మాట్లాడడం లేదు? నిజంగా ఆరోజు సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమా? పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అనవసరంగా క్యాడర్లో అయోమయం సృష్టిస్తున్నారా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. ఒక్కోసారి దూకుడు నిర్ణయాలు లాభం తెచ్చి పెడతాయి. కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి దూకుడుకు పార్టీ క్యాడర్ మూల్యం చెల్లించుకుంటుంది. పల్నాడు జగన్ టూర్ లో సింగయ్య మృతి పై పోలీసులు కీలక నేతలపై కేసు నమోదు చేశారు.
కీలక ఆధారాలతో..
అయితే ఈ కేసును అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. దీనికి సంబంధించిన సాక్షాలు బయటపెట్టి కేసు నమోదు చేశారు పోలీసులు. ఏ 1 గా డ్రైవర్ రమణారెడ్డి, ఏ 2గా జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) పేరు ప్రస్తావిస్తూ కేసు నమోదు చేశారు. హత్య కిందకు రాని కల్పబుల్ హోమీ సైడ్ సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది. అంటే ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ తరహా సెక్షన్ ఉపయోగిస్తారు. ప్రస్తుతం పల్నాడు పోలీసులు అదే చేశారు. ఈ కేసు నమోదు చేయడానికి ముందు ఆ సెక్షన్ పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. అటు తరువాతనే కేసు నమోదు చేశారు.
అదో పెద్ద సెక్షన్
కల్పబుల్ హోమీ సైడ్( kalpabul homeeside) సెక్షన్ అనేది చిన్నది కాదు. నిర్లక్ష్యంతో ఒకరి చావుకు కారణమని భావించి బిఎన్ఎస్ 106 (1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తులో దొరికిన పుటేజీలు ఆధారంగా కల్పబుల్ హోమి సైడ్ అని నిర్ధారణకు వచ్చారు. పవర్ఫుల్ సెక్షన్లను జత చేశారు. జగన్ తో సహా వైసిపి నేతలపై కేసు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే మాత్రం జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానా రెండు విధించేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సెక్షన్ పూర్తిగా నాన్ బెయిలబుల్ అంటున్నారు. నేరానికి ప్రేరేపించారనే అభియోగం పై బి.ఎన్.ఎస్ 49 సెక్షన్ ను ఈ కేసులో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి స్పష్టమైన వీడియోలు ఉండడంతో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు తప్పదు.
Also Read: Jagan vs Yellow Media War: టీడీపీ, ఎల్లోమీడియాతో యుద్ధం చేస్తున్నాం
పోలీస్ శాఖ సీరియ స్
అయితే ఈ ఘటనకు సంబంధించి ఏపీ పోలీస్ శాఖ ( police department)సీరియస్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు 11 వాహనాలతో కాన్వాయ్ కు మాత్రమే అనుమతి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 50 వాహనాలతో తాడేపల్లి నుంచి బయలుదేరారు. భారీగా జన సమీకరణ చేశారు. ఒక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి విగ్రహ ఆవిష్కరణకు.. మరో పార్టీ కార్యకర్తను బలిగొన్నారు అన్న విమర్శను, అపవాదును ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన విషయంలో ఎలా రియాక్ట్ కావాలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదు. నాయకులు సైతం ఈ ఘటనపై స్పందించడం లేదు. మరోవైపు సెక్షన్లు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా ఇబ్బంది ఉంటుందని మాత్రం తెలుస్తోంది.