YS Jagan Mohan Reddy: అమ్మ తినదు.. తిననివ్వదు అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఆయన అధికారానికి దూరమై రెండేళ్లు సమీపిస్తోంది. ఏదైనా మంచి పని జరిగితే అది తమ క్రెడిట్ అన్నట్టు చెబుతారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఏదైనా మంచి పనులు చేస్తే దానికి వ్యతిరేక ప్రచారం సోషల్ మీడియాలో చేయిస్తారు. ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్( rural development trust) విషయంలో అలానే చేస్తున్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న సంస్థకు విదేశీ నగదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లైసెన్సును నిలిపివేసింది. ఇటీవలే దాని పునరుద్ధరణ జరిగింది. కానీ దానిపై జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు చూస్తే ఆయన బుద్ధి అంతా అల్పమా? అని అందరికీ అనిపిస్తుంది. దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తోంది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. అటువంటి సంస్థకు విదేశీ నిధులు కీలకం. కేంద్ర ప్రభుత్వం అనుమతి నిలిపివేతతో అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు అద్దంకి తొలగిపోవడం శుభపరిణామం. అయితే దానిని కూడా పొలిటికల్ ప్రచారం కోసం.. క్రెడిట్ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వక్రబుద్ధిని తెలియజేస్తోంది.
Also Read: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాధవీలత దుర్గా స్తుతి.. వీడియో వైరల్
* సుదీర్ఘ చరిత్ర..
రాయలసీమలో.. ప్రధానంగా అనంతపురం జిల్లాలో( Ananthapuram district) రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు మంచి పేరు ఉంది. కేవలం విదేశీ నిధులతోనే ఈ ట్రస్ట్ నడుస్తూ వస్తోంది. 2021 లో విదేశీ నిధులకు సంబంధించిన లైసెన్స్ గడువు ముగిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చొరవ తీసుకోలేదు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధులకు సంబంధించిన అనుమతులు ఇచ్చే ముందు అత్యంత కఠినమైన నిబంధనలను పరిశీలిస్తుంది. గతంలో మదర్ థెరిసా వంటి దిగ్గజాలకు కూడా మతమార్పిడులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నందున అనుమతులు నిరాకరించిన దాఖలాలు మనదేశంలో ఉన్నాయి.
* మంచి పేరు..
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ కు( moncho ferrar ) మంచి పేరు ఉంది. ఆయన కేవలం సేవలకి ప్రాధాన్యం ఇస్తారు. ఎటువంటి మతమార్పిడులకు తావులేదు. ఇదే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సానుకూలమైన నివేదికలు పంపింది. నిరంతరం ఫాలో అప్ చేసింది. ప్రతి దశలోనూ ఇంటలిజెన్స్ నివేదికలను సానుకూలంగా పంపడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషించింది. అందుకే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విదేశీ నిధులకు అనుమతి ఇచ్చింది. అయితే నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ స్వయంగా చంద్రబాబుతో పాటు లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పే వరకు బయట ప్రపంచానికి ఈ విషయం తెలియదు. ఇది జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మింగుడు పడని విషయం. అందుకే సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వారు చేయలేరు.. చేసిన వారిని చూసి ఓర్వలేరు అన్నట్టు ఉంది వారి పరిస్థితి. రాష్ట్రంలో ఒక మంచి పని జరుగుతున్నప్పుడు స్వాగతించాలి. అది వీలుకాకపోతే మౌనంగా ఉండాలి. జగన్ మాత్రం ఆ పని చేయలేకపోతున్నారు.
