Jagan Bulletproof Car Seized : మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి( Y.S Jagan Mohan Reddy ) షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం ఆయనకు షాక్ ఇచ్చింది. తాజాగా నమోదైన కేసులో ఆయనకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఆయన వాడుతున్న బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా సీట్ చేశారు పోలీసులు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన లేకపోవడంతో వైసిపి నేత లేళ్ల అప్పి రెడ్డికి నోటీసులు అందజేశారు. విచారణకు జగన్మోహన్ రెడ్డి తప్పకుండా హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కొద్దిరోజుల కిందట జగన్ పల్నాడు పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో గుంటూరు సమీపంలో జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందారు. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఏ2గా పేర్కొన్నారు. తాజాగా నోటీసులు ఇచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరవుతారా? లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? అన్నది చూడాలి.
* తొలుత విభిన్న ప్రకటన.. గుంటూరుకు( Guntur ) సమీపంలో సింగయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే అది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఢీ కొట్టిన ప్రమాదం కాదని గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఆ తరువాత లభించిన వీడియోల ఆధారంగా జగన్ కారు కింద పడి చనిపోయాడని గుర్తించారు. దీంతో ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారు. కొత్త సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ రమణారెడ్డిని ఏ 1గా, జగన్మోహన్ రెడ్డిని ఏ2గా, ఆయన పిఏ నాగేశ్వర్ రెడ్డిని ఏ 3గా, వై వి సుబ్బారెడ్డిని ఏ 4 గా, పేర్ని నానిని ఏ5 గా, విడదల రజిని ఏ 6 గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. కేసు విచారణ కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పకుండా రావాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు. జగన్ లేకపోవడంతో కార్యాలయ ఇన్చార్జిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు.
* వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం
మరోవైపు ప్రమాదానికి కారణమైన జగన్మోహన్ రెడ్డికి చెందిన బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ కారు( bullet proof Fortuner car ) AP40DH2349ను పోలీసులు సీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నే కాదు ఆయన కారును సైతం వదిలేది లేదంటూ కూటమి ప్రభుత్వం విరుచుకుపడుతోందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఆ వీడియోలో కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోవడం కనిపించింది. విపరీతమైన జనాలు ఉండడంతో.. సింగయ్య కారు చక్రాల కింద పడిన విషయాన్ని కూడా ఎవరు గుర్తించలేకపోయారు. అయితే చాలామంది కేకలు వేస్తున్న అక్కడ ఎవరు పట్టించుకోలేదని ఆ వీడియోలో తెలుస్తోంది. అయితే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియో అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. పోలీసులు మాత్రం పూర్తిస్థాయిలో నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే తాము ఎఫ్ఐఆర్లో మార్పులు చేసినట్లు చెబుతున్నారు. ఇంకోవైపు అదేరోజు సింగయ్య భార్యకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పది లక్షల రూపాయలు ఇవ్వడంపై కూడా అనుమానాలు ఉన్నాయి. మొత్తానికైతే ఏపీ రాజకీయాలు ఇప్పుడు సింగయ్య మృతి చుట్టూ తిరుగుతున్నాయి.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
వైఎస్ జగన్ పై కక్షసాధింపు చర్యలు
YS జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లిన పోలీసులు
సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వాహనం తరలింపు
YSRCP కేంద్ర కార్యాలయం నుంచి వాహనం తీసుకెళ్లిన పోలీసులు
సొంత డబ్బులతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొన్న వైఎస్ జగన్@ysjagan pic.twitter.com/MlHOJiJoEM
— BUCHEPALLI SIVAPRASAD REDDY (@mlasivanna) June 24, 2025