India vs England Test Match : వాస్తవానికి భారత్ ఇంగ్లాండ్ ఎదుట విధించిన టార్గెట్ 371 రన్స్. టెస్ట్ క్రికెట్లో ఇవి చేయడం ఒకరకంగా కష్ట సాధ్యమైనది. అయితే దానిని ఇంగ్లాండ్ ప్లేయర్లు నిజం చేసి చూపించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ (149) ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. భారత బౌలింగ్ లోపాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నాడు.. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లకు నరకం చూపించాడు. డకెట్ ఆకాశమే హద్దు లాంటి బ్యాటింగ్ తో టీమిండియా విధించిన 371 రన్స్ టార్గెట్ క్రమంగా కరుగుతూ వచ్చింది.. వాస్తవానికి డకెట్ 97 పరుగుల వద్ద అవుట్ కావాల్సి ఉండేది. అయితే అతడు ఇచ్చిన క్యాచ్ ను జైస్వాల్ వదిలేసాడు..
సెంచరీ చేశాడు
97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డకెట్ క్యాచ్ ఇవ్వగా.. దానిని జైస్వాల్ నేలపాలు చేశాడు.. జైస్వాల్ నిర్లక్ష్యం పట్ల మహమ్మద్ సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.. అంతేకాదు జైస్వాల్ మీద తిట్టాడు. గ్యాలరీలో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అసహనాన్ని వ్యక్తం చేశాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన 39 ఓవర్లో ఐదవ బంతిని డకెట్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. గాల్లోకి అమాంతం లేచింది. బౌండరీ లైన్ దగ్గర నుంచి యశస్వి పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు.. డైవ్ చేసుకుంటూ వచ్చాడు. అయితే బంతిని అందుకోలేకపోయాడు. ఇంత సిరాజ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. గౌతమ్ గంభీర్ కూడా తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శించాడు.. ఇక ఇలా లభించిన జీవదానాన్ని డకెట్ సద్వినియోగం చేస్తున్నాడు. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్నాడు..
అత్యంత చెత్త రికార్డు
ఈ క్యాచ్ డ్రాప్ చేయడం ద్వారా టెస్ట్ క్రికెట్లో జైస్వాల్ అత్యంత చెత్త రికార్డు తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో అత్యధికంగా క్యాచులను వదిలేసిన భారత ఆటగాడిగా దారుణమైన రికార్డును తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో జైస్వాల్ నాలుగు క్యాచులను వదిలేయడం విశేషం.. ఒకవేళ అతడు గనుక ఆ క్యాచులు పట్టి ఉంటే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది.. ఇక జైస్వాల్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. కానీ రెండవ ఇన్నింగ్స్ విషయానికి వచ్చేసరికి దారుణంగా విఫలమయ్యాడు. నిర్లక్ష్య పూరితమైన ఆట తీరుతా వికెట్ సమర్పించుకున్నాడు. అతడు అవుట్ అయిన తర్వాత.. జట్టు సారథి గిల్ కూడా బంతిని అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఇక అంతకుముందు సాయి సుదర్శన్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. దీంతో భారత్ సెంచరీ కిలోపే మూడు వికెట్లు కోల్పోవడం విశేషం.
Siraj bowled Duckett and Jaiswal dropped a sitter!#INDvsENG #dspsiraj pic.twitter.com/TiLWpNSEBa
— TheDoosraGuy (@manwithviews07) June 24, 2025