Homeఆంధ్రప్రదేశ్‌Jagan Bold Statement: జగన్ లో ఆ గంభీరం లేదు... కానీ రాజారెడ్డి కనిపిస్తున్నాడు

Jagan Bold Statement: జగన్ లో ఆ గంభీరం లేదు… కానీ రాజారెడ్డి కనిపిస్తున్నాడు

Jagan Bold Statement: ఫ్యాక్షన్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhara Reddy ). ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఫ్యాక్షన్ సంస్కృతి రాజ్యమేలుతుందని అంతా భావించారు. ప్రత్యర్థుల సైతం అదే స్థాయిలో విమర్శలు చేశారు. కానీ దానికి భిన్నంగా పాలన అందించి అందరి మన్ననలు అందుకున్నారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఈ విషయంలో ప్రత్యర్థుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఘనత ఆయనది. ఆయన తరువాత కుమారుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ జోలికి వెళ్లలేదు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయనలో శైలి కనిపిస్తుందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే క్రమంలో ఆయన చేస్తున్న ప్రకటనలు మాత్రం.. ఆయన స్థాయికి తగ్గట్టు లేవు.

Also Read: Jagan Speech Mistakes: జగన్ నోటి నుంచి మరో రెండు ఆణిముత్యాలు..వైరల్!

మీడియా సమావేశంలో సంచలనం..
నిన్ననే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. టిడిపి కూటమి ప్రభుత్వ( TDP Alliance government ) తీరుపై విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. కొంతమంది ఉన్నతాధికారుల పేర్లు ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజం ఎత్తారు. ఈ క్రమంలో ఆయన చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ హెచ్చరికలు తరహాలో ఉన్నాయి. అయితే గొంతులో గాంభీర్యం లేదు కానీ.. ఆయన తాత రాజారెడ్డిని గుర్తుచేసేలా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ ఉన్నాయని రాజకీయ ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు.

పదేపదే హెచ్చరికలు..
మరో మూడేళ్లలో కూటమి ప్రభుత్వం పోతుంది.. మా ప్రభుత్వం వస్తుందని జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పదేపదే చెబుతున్నారు. నిన్న కూడా అదే ప్రస్తావన తీసుకొచ్చారు. ఈరోజు మేము కింద ఉన్నాం. రేపు పైకి వస్తాం. ఎలా ఉంటుందో పరిస్థితి చూసుకోండి అంటూ గట్టి హెచ్చరికలు పంపారు. అయితే జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ ఈ స్థాయిలో నేరుగా హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు పరోక్ష హెచ్చరికలు, చర్యలకు పరిమితం అవుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు నేరుగా మేము వస్తాము. మీపై ప్రతాపం చూపుతాం అంటూ గట్టి హెచ్చరికలే పంపారు. అయితే ఇది రాజశేఖర్ రెడ్డి విధానం కాదని.. జగన్ మాటలలో రాజారెడ్డి స్వరం కనిపిస్తోందని.. గాంభీ ర్యత లేకపోయినా.. అర్థం అదేనని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

Also Read: Hindupur TDP Strategy: నందమూరి బాలకృష్ణ నెత్తిన పాలు పోసిన జగన్!

వారి జోలికి పోని రాజశేఖర్ రెడ్డి
వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నప్పుడే ఆయన తండ్రి రాజారెడ్డి( Raja Reddy) హత్యకు గురయ్యారు. రాజకీయ ప్రత్యర్థుల చేతిలో హతమయ్యారు. ఒక కుమారుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. తప్పనిసరిగా ప్రతీకార రాజకీయాలు ఉంటాయని అంతా భావించారు. కానీ రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి పోలేదు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. అయితే అదే సంక్షేమాన్ని కొంతవరకు అమలు చేసి తనకంటూ సొంత ఇమేజ్ను సృష్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న కామెంట్స్ మాత్రం తాత రాజారెడ్డి సంస్కృతిని గుర్తు చేస్తున్నాయి. ఇది ముమ్మాటికి తప్పిదం అని.. తండ్రి మాదిరిగా మంచి రాజకీయాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారన్నది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular