Jagan : కోట్లాది మంది ఆంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమరావతి పునః నిర్మాణ కార్యక్రమాలు రేపటి నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. అమరావతి లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ద్వారా ఈ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచేయబోతున్న సంగతి తెలిసిందే. సుమారుగా 57 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను రేపు ప్రధాన మంత్రి వర్చువల్ గా ప్రారంభించబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 5 లక్షల మంది జనాలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఎక్కడా కూడా ఏర్పాట్లలో లోపాలు లేకుండా, పటిష్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లతో పాటు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తానికి ఆహ్వాన పత్రికలు అందజేశారు.
Also Read: అమరావతిలో ప్రధాని సభకు జగన్.. కీలక నిర్ణయం!
కేవలం కూటమి నేతలకు మాత్రమే కాదు, విపక్ష పార్టీ వైసీపీ కి కూడా ఆహ్వానం అందింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కి సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత సిబ్బంది చేత ఆహ్వాన పత్రిక ని పంపించాడట. అయితే రేపు సభకు వెళ్ళాలా వద్దా అనే విషయం పై జగన్ తన పార్టీ సన్నిహితులతో చర్చలు జరిపాడట. వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు సాయంత్రం వెలువడే అవకాశం ఉందట. 2014 వ సంవత్సరం లో శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష హోదా లో అమరావతి ని రాజధాని గా ఒప్పుకుంటున్నాము అంటూ మాజీ సీఎం జగన్(YS Jagan Mohan Reddy) తీర్మానం చేసాడు. అప్పట్లో కూడా ఆయన్ని రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించగా, జగన్ పాల్గొనలేదు. ఇప్పుడు మరోసారి ఆయన అదే పని చేస్తున్నాడు. దీనిని జనాలు ఎలా తీసుకుంటారో కాస్త ఆలోచించమని కొంతమంది సన్నిహితులు జగన్ కి చెప్పగా, ఆయన ఒప్పుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
రేపు సాయంత్రం మూడు గంటల నుండి ఈ కార్యక్రమం మొదలు కానుంది. గ్రాండ్ గా ఏర్పాటు చేసిన స్టేజి పై కేవలం 14 మంది మాత్రమే కూర్చుంటారట. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్, మరియు పలువురు కేంద్ర మంత్రులు మాత్రమే ఈ వేదిక పై ఉంటారు. శాసనసభ్యులు, ఎంపీలు, మాంత్రులు క్రింది గ్యాలరీ లో కూర్చుంటారట. అయితే పోయినసారి రాజధాని నిర్మాణం శంకుస్థాపన సమయం లో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మట్టిని తెచ్చి ఇచ్చేసి వెళ్ళాడు. రాజధాని నిర్మాణం కోసం నిధులు ప్రకటిస్తారేమో అని ఎదురు చూసిన ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యింది. ఈసారి కూడా అలాగే చేస్తాడా?, లేకపోతే రాజధాని అభివృద్ధి కోసం ఏదైనా కీలక ప్రకటన చేయబోతున్నాడా అనే అంశం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏమి జరగబోతుందో.