Deputy CM Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) పాలన ఏ స్థాయిలో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల సమయంలోనే ఆయన పాలనలో గ్రామా పంచాయితీలు 70 సంవత్సరాలుగా చూడని అద్భుతమైన పురోగతిని చూసింది. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ అధికారం లో ఉంటే ఇలాంటి అద్భుతాలే జరిగతాయని ప్రజలు మాట్లాడుకున్నారు,ఆయన ఇమేజ్ జనాల్లో విపరీతంగా పెరిగిపోయింది. డిప్యూటీ సీఎం గా ఉంటేనే ఇన్ని చేస్తున్నాడంటే, ఇక సీఎం గా ఉంటే ఏ రేంజ్ పరిపాలన అందిస్తాడో అని అందరూ మాట్లాడుకున్నారు. కేవలం గ్రామా పంచాయితీలను అభివృద్ధి చేయడమే కాదు, రాష్ట్రము లో ఏ సమస్య ఎదురైనా పవన్ కళ్యాణ్ తన గళాన్ని వినిపిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించాడు. దీంతో తెలుగు దేశం పార్టీ క్యాడర్ లో, లీడర్స్ లో కాస్త అభద్రతా భావం కలిగింది.
క్రేజ్ మొత్తం కూటమి లో పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కుతుంది, నారా లోకేష్(Nara Lokesh) ని అసలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, తండ్రి చాటు బిడ్డగానే ఆయన మిగిలిపోయేలా ఉన్నాడు అంటూ టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో టీడీపీ క్యాడర్, టీడీపీ ఎమ్మెల్యే లు నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ బాగా పెరిగింది. సోషల్ మీడియా లో అటు టీడీపీ అభిమానుల మధ్య, ఇటు జనసేన అభిమానుల మధ్య ఈ అంశంపై పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగాయి. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ పవన్ కళ్యాణ్ ని మాత్రం సీఎం చేయాలి అనే డిమాండ్ ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ అంశం ఇరు పార్టీల అదిష్టానాల వరకు వెళ్లడంతో వెంటనే స్పందించి ఫుల్ స్టాప్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అయితే రిపబ్లిక్ డే రోజున అభిమానులు ఓర్పు వహించాలి అంటూ పెద్ద లేఖనే రాసుకొచ్చాడు.
ఆరోజు నుండి వరుసగా 15 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ అయ్యాడు. ఈ 15 రోజులు ఎందుకు ఆయన అంత మౌనం వహించాడు?, నిజంగా ఆరోగ్యం బాగాలేక కనిపించలేదా, లేదా లోకేష్ ని హైలైట్ చేయడానికి, ఈయన లౌ ప్రొఫైల్ ఇక నుండి మైంటైన్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడా? అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. నిన్న జరిగిన మ్యూజికల్ నైట్ లో పవన్ కళ్యాణ్ నారాలోకేష్ గురించి మాట్లాడుతూ ‘ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుని తీర్చి దిద్దడంలో కీలకమైన అడుగులు వేస్తున్న లోకేష్ గారికి’ అంటూ సంబోదించాడు. ఇది పవన్ కళ్యాణ్ యాదృచ్చికంగా అన్న మాటలా?, లేకపోతే భవిష్యత్తులో మనం లోకేష్ ని మోయాలి అంటూ తన అభిమానులను ప్రిపేర్ చేయడానికి ఇప్పటి నుండే రెడీ చేస్తున్నాడా అనే సందేహిస్తున్నారు.