Nara Brahmani Political Entry: నందమూరి కుటుంబంలో( Nandamuri family) ఎంతోమంది మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఇప్పటికే పురందేశ్వరి, భువనేశ్వరి వేర్వేరు రంగాల్లో తమకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. మరోవైపు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి సైతం తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. వ్యాపార రంగంలో ఉన్న ఆమె.. మెట్టినింట కుటుంబం రాజకీయాల్లో ఇబ్బందిగా ఉంటే భాగస్వామ్యం అయ్యేవారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రజల్లోకి బలంగా వచ్చారు. భర్త లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో అప్పుడప్పుడు పర్యటిస్తుంటారు. అయితే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో తెలుగుదేశం పార్టీలో ఆమెను ప్రయోగించబోతున్నారన్న టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఇటీవల బిజినెస్ టుడే అని పత్రిక బలమైన మహిళా వాణిజ్య వేత్తగా గుర్తించింది. ఆమెకు పురస్కారం అందించింది. జాతీయస్థాయిలో బ్రాహ్మణి పేరు మార్మోగిపోయింది. అందుకే ఇప్పుడు ఆమె పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల ప్రచారం నడుస్తోంది.
అలా హెరిటేజ్ బాధ్యతలు..
1978లో చంద్రబాబు( CM Chandrababu) రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. మంత్రి పదవి కూడా చేపట్టారు. టిడిపిలో చేరిక మరింతగా క్రియాశీలకం అయ్యారు. ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే వ్యాపారంలో అడుగు పెట్టాలని భావించి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు వ్యాపారంలో దృష్టి పెట్టలేకపోయారు. అందుకే ఆ బాధ్యతను తన భార్య భువనేశ్వరికి అప్పగించారు. విదేశాల్లో చదువుకున్న లోకేష్ సైతం హెరిటేజ్ కు సేవలందించారు. అయితే లోకేష్ వివాహం జరిగాక విద్యాధికురాలు అయిన బ్రాహ్మణి పూర్తిస్థాయిలో హెరిటేజ్ బాధ్యతలను చూస్తున్నారు. ప్రస్తుతం భువనేశ్వరి సైతం హెరిటేజ్ క్రియాశీలక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారు. వ్యాపారంలో తనకంటూ ఒక ముద్ర చాటుకుంటున్నారు బ్రాహ్మణి. ఇటువంటి సమయంలో రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
గతంలో సైతం ప్రచారం..
నందమూరి ఫ్యామిలీలో పురందేశ్వరి రాజకీయంగా ఆక్టివ్ గా ఉన్నారు. మరోవైపు హరికృష్ణ కుమార్తె సుహాసిని సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు బ్రాహ్మణి సైతం రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం నడుస్తోంది. వైసిపి హయాంలో చంద్రబాబు అరెస్టు అయ్యారు. 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండిపోయారు. ఆ సమయంలో భువనేశ్వరి తో పాటు బ్రాహ్మణి సైతం ఆందోళన బాట పట్టారు. అప్పట్లోనే బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారని అంతా ప్రచారం నడిచింది. అయితే తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు బ్రాహ్మణి. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. అయితే సాధారణంగా ఇప్పుడు నేతలుగా ఎదిగిన వారంతా ఏదో సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వారే. అటువంటి పరిస్థితి బ్రాహ్మణికి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.