HomeతెలంగాణTelangana pensioners: తెలంగాణ పెన్షనర్లకు గుడ్‌ న్యూస్‌.. ఏప్రిల్‌ నుంచి రెట్టింపు!?

Telangana pensioners: తెలంగాణ పెన్షనర్లకు గుడ్‌ న్యూస్‌.. ఏప్రిల్‌ నుంచి రెట్టింపు!?

Telangana pensioners: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ప్రజలు కూడా రేవంత్‌సర్కార్‌ పాలన తీరుపై అసంతృప్తితో ఉన్నారు. దాని ప్రభావం పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తోంది. మెజారిటీ గ్రామాల్లో అధికార పార్టీ మద్దతుదారులు విజయం సాధిస్తున్నా.. ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో పింఛన్లు రెట్టింపు చేస్తామన్న ఎన్నికల హామీ అమలుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 44 లక్షల మంది పెన్షనర్లకు ఏప్రిల్‌ 2026 నుంచి రూ.4 వేల చొప్పున పెన్షన్‌ ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈమేరకు. ఆర్థిక శాఖ నిధుల సమీకరణ మార్గాలను పరిశీలిస్తోంది. ప్రస్తుత రూ.2,016 నుంచి రెట్టింపు చేస్తే రూ.22 వేల కోట్లు అవసరమని అంచనా.

ప్రస్తుతం రూ.11,635 కోట్లు చెల్లింపు..
వృద్ధాప్య, వితంతు, మౌలిక సేవల పెన్షనర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.11,635 కోట్లు కేటాయించారు. పెంపు అమలు అయితే ఖర్చు రెట్టింపు అవుతుంది. రాష్ట్ర బడ్జెట్‌లో 12% పెన్షన్లకు వెళ్తుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర నిధులు, పెట్టుబడుల వసూళ్లపై ఆధారపడుతున్నారు.

దశలవారీ అమలు..
ఒకేసారి రూ.4 వేల పెంపు సాధ్యం కాకపోతే దశలవారీగా అమలు చేయనుంది. మొదట రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు పెంచి, తర్వాత పూర్తి మొత్తానికి చేర్చే ఆలోచన ఉంది. ఇది పెన్షనర్లకు ఉపశమనం కల్పిస్తుంది. కాంగ్రెస్‌ హామీలను నెరవేర్చడంలో ఈ నిర్ణయం కీలకం.

ఆర్థిక సవాళ్లు..
రాష్ట్ర ఆదాయాలు 15% పెరిగినా పెన్షన్‌ ఖర్చు 100% పెరుగుతుంది. జీఎస్టీ సేకరణ, ఆస్తి పన్నులు, కార్పొరేట్‌ ట్యాక్స్‌ల ద్వారా నిధులు సమీకరిస్తారు. కేంద్రం నుంచి అదనపు గ్రాంట్లు కోరుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు విజయవంతమైతే ఇతర సంక్షీమాల పెంపుకు మార్గం సుగమవుతుంది.

ప్రస్తుతం రూ.2,016 పెన్షన్‌ ఆహార, వైద్య ఖర్చులకు సరిపోవడం లేదు. రూ.4 వేలక పెంచితే ఆరోగ్యం వ్యయంతోపాటు ఇతర సదుపాయాలు మెరుగవుతాయి. వృద్ధులు, వితంతు మహిళలకు ఈ పెంపు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version