Tirumala Stampede: తిరుపతిలో( Tirupati) తొక్కిసలాట పెను విషాదాన్ని నింపింది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. అయితే ఉదయం వరకు పటిష్ట ఏర్పాట్లు చేయడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ సాయంత్రానికి ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అయితే ఇది విద్రోహ చర్య అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కావలిసే తోపులాటకు కొందరు కారణమయ్యారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై టీటీడీ విచారణ( TTD enquiry ) చేపడుతోంది. అయితే నిన్ననే ఏపీలో పర్యటించారు ప్రధాని మోదీ. విశాఖలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. దీంతో యావత్ రాష్ట్రం ప్రధాని పర్యటన వైపు చూసింది. ప్రధాని మోదీ తో పాటు సీఎం చంద్రబాబు( Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) పాల్గొన్నారు. మొత్తానికి ప్రధాని విశాఖ టూర్ సక్సెస్ అయ్యింది. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై ఏపీవ్యాప్తంగా సంతృప్తి వ్యక్తం అవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో తిరుపతిలో ఈ తొక్కిసలాట జరగడం ఆందోళన కలిగిస్తోంది.
* ప్రధాని తొలి పర్యటన
ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రధాని మోదీ( Narendra Modi) అధికారికంగా ఏపీ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. వాస్తవానికి డిసెంబర్లోనే ప్రధాని మోదీ విశాఖ రావాల్సి ఉంది. కానీ అప్పట్లో వర్షాల కారణంగా ప్రధాని పర్యటన వాయిదా పడింది. అయితే ఈసారి ప్రధాని తొలి పర్యటనను సక్సెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గత కొద్దిరోజులుగా సన్నాహాలు చేస్తోంది. ప్రధాని విశాఖ పర్యటన ఇన్చార్జిగా మంత్రి నారా లోకేష్( Nara Lokesh) వ్యవహరించారు. మూడు రోజులు ముందుగానే విశాఖకు చేరుకొని పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. అటు బిజెపి కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ( Bhupathi Raju Srinivasa Verma ), రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉత్తరాంధ్ర మంత్రులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు రెండు లక్షల మందిని సమీకరించగలిగారు. ఏకంగా 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా ఏపీ ఫై పూర్తి దృష్టి పెట్టాయి. బుధవారం ఉదయం నుంచి ప్రధాని విశాఖ పర్యటనపై ఫోకస్ పెట్టాయి.
* ప్రధాని పర్యటన సక్సెస్
బుధవారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎన్ఎస్ డేగా( INS dega) ప్రత్యేక విమానంలో దిగారు ప్రధాని మోదీ. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి భారీ రోడ్ షో చేశారు ప్రధాని మోదీ. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. విశాఖ నగరవాసులకు అభివాదం చేస్తూ ఈ ముగ్గురు నేతలు ముందుకు సాగారు. విశాఖకు భారీ ప్రాజెక్టులు తరలి రావడంతో ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురు నేతల షో విశాఖలో సక్సెస్ అయ్యింది. ఏపీ ప్రజలను విశేషంగా ఆకర్షించగలిగింది. అయితే అక్కడకు కొద్ది గంటల్లోనే తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో మీడియా అటెన్షన్( media attention) మొత్తం అటువైపు వెళ్ళిపోయింది.
* అటువైపు అటెన్షన్
ఒక విధంగా చెప్పాలంటే రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి గేమ్ చేంజర్ గా( game changer) నిలవనున్నాయి. ఎన్డీఏ కూటమికి ప్రజల్లో సానుకూలత తెచ్చేందుకు ఇవి ఎంతగానో దోహదపడనున్నాయి. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తిరుపతిలో తొక్కిసలాట జరగడం.. భక్తుల మరణం.. పెద్ద ఎత్తున క్షతగాత్రులు కావడంతో.. అంతవరకు పాకిన అభివృద్ధి నినాదం అటువైపు వెళ్ళిపోయింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Is modi babu pawan development show diverted all is tragedy with a stampede
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com